News February 17, 2026
అన్నమయ్య జిల్లాలో మరో దారుణ హత్య

అన్నమయ్య జిల్లాలోని గాలివీడులో స్టోర్ డీలర్ దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది. మండలంలోని ఒడిసిలెంకవారిపల్లె రేషన్ షాప్ డీలర్ టి. కృష్ణారెడ్డిని కత్తులతో అతి కిరాతకంగా నరికి హత్య చేశారని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి డీఎస్పీ చేరుకొని విచారిస్తున్నారు. అలాగే మదనపల్లెలో బాలికను ఓ వ్యక్తి హత్య చేసిన విషయం తెలిసిందే.
Similar News
News February 23, 2026
మృత్యుపాశాలుగా బ్రిడ్జిలు.. ముందే హెచ్చరించిన Way2News

ADB ఉట్నూర్(M)లోని <<19074105>>బ్రిడ్జిలు ఇరుకుగా ఉండి<<>> ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉట్నూర్ నుంచి ADB వెళ్లే దారిలో ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. షాంపూర్, పులిమడుగు వద్ద బ్రిడ్జిలకు సైడ్‌వాల్స్ లేకపోవడంపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో ప్రమాదం అంచున ప్రయాణం అంటూ గతంలో Way2Newsలో కథనాలు ప్రచురితమయ్యాయి. అధికారులు అప్పుడే స్పందించి ఉంటే బస్సు ప్రమాదం జరిగేది కాదని విమర్శలు వస్తున్నాయి.
News February 23, 2026
తెలంగాణ కబడ్డీ జట్టు కెప్టెన్‌గా పాలమూరు బిడ్డ

తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెన్‌గా పాలమూరు పరిధి గద్వాల్‌కు చెందిన జి.రాజు ఎంపికైనట్లు కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డీకే స్నిగ్ధారెడ్డి ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. గుజరాత్‌లో రేపటి నుంచి ప్రారంభమయ్యే జాతీయస్థాయి సీనియర్ కబడ్డీ టోర్నీలో తెలంగాణ జట్టుకు సారథ్యం వహించనున్నారు. ఉమ్మడి జిల్లా నేతలు, కబడ్డీ అసోసియేషన్ సభ్యులు, కుటుంబ సభ్యులు, పీడీలు హర్షం వ్యక్తం చేశారు.
#CONGRATULATIONS
News February 23, 2026
మోచేతులు నల్లగా ఉన్నాయా? ఈ టిప్స్ పాటించండి

ముఖంపై పెట్టే శ్రద్ధ చాలామంది కాళ్లు, చేతులపై పెట్టరు. దీంతో మోచేతులు, మోకాళ్లు నల్లగా మారతాయి. దీన్ని కొన్ని ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. రోజుకి రెండు సార్లు కలబంద గుజ్జును మోచేతులు, కాళ్లకి రాస్తుంటే నలుపుదనం తగ్గుతుంది. స్పూన్ ఆలివ్ ఆయిల్‌లో కాస్త పంచదార వేసి దాంతో చేతులు, కాళ్లని స్క్రబ్ చేసి, 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి రాసినా సమస్య తగ్గుతుంది.


