News February 17, 2026
FLASH.. తొర్రూరులో ఛైర్మన్ ఎన్నికకు లక్కీ డ్రా తీసే అవకాశం?

తొర్రూరు మున్సిపాలిటీ బాధ్యతలను ఎంపీ రఘురామరెడ్డి, MLAలు రాజేందర్ రెడ్డి, నాగరాజుకు TPCC అప్పగించారు. అయితే, ఇప్పటికే BRSకు 9 మంది కౌన్సిలర్లు ఉండగా.. ఎక్స్ అఫిషియోతో కలిపి కాంగ్రెస్‌కు 9 మంది అయ్యారు. రెండు పార్టీలకు సమాన బలం ఉండటంతో ఛైర్మన్ ఎన్నికకు లక్కీ డ్రా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిన్నటి ఘర్షణల నేపథ్యంలో తొర్రూరులో BNS-163 సెక్షన్ అమలు చేశారు. దాదాపు వెయ్యి మంది పోలసులు మోహరించారు.
Similar News
News February 18, 2026
జపం ఎక్కడ చేస్తే ఉత్తమ ఫలితాలు?

జపం చేసే స్థలం, ఆసనాన్ని బట్టి ఫలితం మారుతుందని శాస్త్ర వచనం. వాటి ప్రకారం.. ఉన్ని వస్త్రంపై జపం వంశవృద్ధిని, పర్వత శిఖరంపై జపం తపస్సిద్ధిని కలిగిస్తాయి. ఇంట్లో చేసే జపం సాధారణ ఫలితం, నదీ తీరంలో చేస్తే అంతకన్నా 2 రెట్లు, గోశాలలో 100 రెట్లు పుణ్యం లభిస్తుంది. తిరుమల, కాశీ, శ్రీశైలం వంటి స్వయంభూ క్షేత్రాల్లో చేసే జపానికి కోటి రెట్ల ఫలితం ఉంటుంది. సూర్యుడు, గురువు, దీపానికి అభిముఖంగా జపం చేయాలి.
News February 18, 2026
సోనియా నన్ను CM చేయాలనుకున్నారు.. కానీ: హిమంత

2014లో తనను అస్సాం CM చేయాలని నాటి కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అనుకున్నారని హిమంత బిశ్వ శర్మ చెప్పారు. కానీ రాహుల్ వల్ల మొత్తం మారిపోయిందన్నారు. ‘తేదీ నిర్ణయించుకోమని మేడమ్(సోనియా) చెప్పారు. జూన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తానన్నా. USలో ఉన్న రాహుల్ పార్టీ నాయకులతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత పరిస్థితి మారిపోయింది’ అని ఆరోపించారు. 2015 ఆగస్టులో కాంగ్రెస్ నుంచి BJPలోకి ఆయన చేరారు. 2021లో CM అయ్యారు.
News February 18, 2026
కర్నూలు: ఒక్క నిమిషం ఆలస్యమైనా..

కర్నూలు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో రికార్డు అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నేడు రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు సంస్థ కార్యదర్శి లీలా వెంకటేశ్ శేషాద్రి తెలిపారు. అభ్యర్థులు నిర్దేశించిన సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. గేట్ క్లోజర్ సమయం తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎవరినీ లోపలికి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు.


