News February 17, 2026

సిద్దిపేట: మహిళా మణులకే పదవులు!

image

సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ పదవులు మహిళలకు రిజర్వాయ్యాయి. దీంతో కీలకమైన పదవిలో 4 మహిళా మణులు బాధ్యతలు స్వీకరించారు. చేర్యాల మున్సిపాలిటీ వైస్ ఛైర్‌పర్సన్‌గా మేడిశెట్టి ఉమా, దుబ్బాక-ఆశ సులోచన, గజ్వేల్-ప్రజ్ఞాపూర్-కళ్యాణ్ కర్ పద్మాభాయి, హుస్నాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్‌గా చిత్తారి పద్మ పదవి చేపట్టారు. ఇక్కడ ఛైర్ పర్సన్‌లు కూడా మహిళలే.

Similar News

News February 23, 2026

HYD: పోలీసులకు దొరికితే హెల్మెట్ ఫ్రీ.. Conditions Apply!

image

హెల్మెట్ లేకుండా పట్టుబడితే FINEతో పాటు పోలీసులు FREE‌గా హెల్మెట్‌ ఇస్తున్నారు. మల్కాజిగిరి ట్రాఫిక్ విభాగం ‘హెల్మెట్ బ్యాంక్’ పేరుతో సంగీత్ చౌరస్తాలో ఈ వినూత్న కార్యక్రమం చేపట్టింది. బైకర్ వివరాలు నమోదు చేసి హెల్మెట్ తీసుకోవచ్చు. 24 గంటల్లోపు సొంతంగా హెల్మెట్ కొనుక్కుని పోలీసుల వద్ద తీసుకున్నది తిరిగి ఇచ్చేయాలి. చలాన్ల కన్నా ప్రాణ రక్షణే ముఖ్యం అని పోలీసులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఖమ్మం: ‘వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరాకు సిద్ధం’

image

రాబోయే వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగినా అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని ఎస్‌ఈ శ్రీనివాసాచారి తెలిపారు. ఇప్పటికే గరిష్ఠ డిమాండ్ 5,904మెగావాట్లకు చేరిందని పేర్కొన్నారు. అదనంగా 110కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, మంచుకొండ వద్ద కొత్త సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఓవర్ లోడ్ సమస్య లేకుండా సామర్థ్యాన్ని పెంచామని వివరించారు. నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.