News February 17, 2026

అమరావతి: ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్ద ఆందోళన

image

రెండు రోజుల విరామం తర్వాత ఉదయం 11 గంటలకు ఏపీ శాసనమండలి సమావేశాలు పునఃప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే తిరుమల కల్తీ నెయ్యి అంశంపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీల నెయ్యి సరఫరాపై వాయిదా తీర్మానం ఇవ్వగా ఛైర్మన్ తిరస్కరించారు. దీనిపై ఆగ్రహంతో ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్ద ఆందోళన చేపట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. చివరికి ఛైర్మన్ సభను వాయిదా వేశారు.

Similar News

News February 23, 2026

నార్నూర్‌లో పెళ్లికి కట్నకానుకలు నిషేధం

image

నార్నూర్ మండలంలోని ఖైర్డాట్వ గ్రామంలో ఆదివారం గ్రామస్థులు కలిసి పెళ్లికి కట్నకానుకలను నిషేధిస్తూ తీర్మానించారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన వధువు మడావి పూర్ణబాయి పెళ్లి కోసం 100 కుటుంబాలు కలిసి రూ.26,551 నగదు పొదుపు చేసి అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పటేల్ మడావి నరాంజి రావు, జంగు, మోతిరాం, గోవిందరావు, తుకారాం తదితరులు పాల్గొన్నారు.

News February 23, 2026

NGKL: నేడు రాష్ట్రవ్యాప్త కొవ్వొత్తుల ర్యాలీకి తీన్మార్ మల్లన్న పిలుపు

image

కుమ్మర మల్లన్న జాతరలో కాంగ్రెస్ నాయకుల దాడిలో బీసీ చిన్నారి మరణించిన ఘటనను నిరసిస్తూ, సోమవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని టీఆర్‌పీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. ప్రభుత్వ అరాచకాలను, పోలీసుల పక్షపాత వైఖరిని నిరసిస్తూ గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో ఈ ర్యాలీలు చేపట్టాలని ఆయన కోరారు.

News February 23, 2026

పాక్ వైమానిక దాడులపై భారత్ ఫైర్

image

అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. మహిళలు, పిల్లలు ప్రాణాలు కోల్పోవడం దారుణమని విదేశీ వ్యవహారాల శాఖ మండిపడింది. తన దేశంలోని అంతర్గత వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే పాక్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని పేర్కొంది. అఫ్గానిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేసింది.