News February 17, 2026

పాలమూరు: ‘నేడే లాస్ట్.. రిజిస్ట్రేషన్ చేసుకోండి’

image

నూతన బడ్జెట్‌పై క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా యువజన అధికారి వి.కోటా నాయక్ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ప్రతిభకనబరిచిన యువత జాతీయస్థాయిలో క్విజ్ పోటీలు నిర్వహించి, నేరుగా ప్రధానమంత్రితో సంభాషించే అవకాశం భారత ప్రభుత్వం కల్పిస్తుందని, 15-29 వయస్సు గలవారు అర్హులని, అర్హత గల యువత ఈనెల 17లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
Site:https://mybharat.gov.in

Similar News

News February 23, 2026

HYD: పోలీసులకు దొరికితే హెల్మెట్ ఫ్రీ.. Conditions Apply!

image

హెల్మెట్ లేకుండా పట్టుబడితే FINEతో పాటు పోలీసులు FREE‌గా హెల్మెట్‌ ఇస్తున్నారు. మల్కాజిగిరి ట్రాఫిక్ విభాగం ‘హెల్మెట్ బ్యాంక్’ పేరుతో సంగీత్ చౌరస్తాలో ఈ వినూత్న కార్యక్రమం చేపట్టింది. బైకర్ వివరాలు నమోదు చేసి హెల్మెట్ తీసుకోవచ్చు. 24 గంటల్లోపు సొంతంగా హెల్మెట్ కొనుక్కుని పోలీసుల వద్ద తీసుకున్నది తిరిగి ఇచ్చేయాలి. చలాన్ల కన్నా ప్రాణ రక్షణే ముఖ్యం అని పోలీసులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఖమ్మం: ‘వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరాకు సిద్ధం’

image

రాబోయే వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగినా అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని ఎస్‌ఈ శ్రీనివాసాచారి తెలిపారు. ఇప్పటికే గరిష్ఠ డిమాండ్ 5,904మెగావాట్లకు చేరిందని పేర్కొన్నారు. అదనంగా 110కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, మంచుకొండ వద్ద కొత్త సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఓవర్ లోడ్ సమస్య లేకుండా సామర్థ్యాన్ని పెంచామని వివరించారు. నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.