News February 17, 2026

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

image

నాదెండ్ల – గణపవరం మధ్య నూతన హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో, వాహనదారుడు ఎగిరి కిందపడి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హెల్మెట్ ధరించకపోవడమే మరణానికి ప్రధాన కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెల్మెట్ ఉండి ఉంటే ప్రాణాలు దక్కేవన్నారు.

Similar News

News February 28, 2026

ముంబైలో కెనడా ప్రధాని: టార్గెట్ $50 బిలియన్లు

image

కెనడా ప్రధాని మార్క్ కార్నీ తన తొలి అధికారిక పర్యటనలో భాగంగా ముంబై చేరుకున్నారు. భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీ అని కొనియాడారు. ఇరు దేశాల మధ్య ట్రేడ్, ఎనర్జీ, AI రంగాల్లో పార్ట్‌నర్‌షిప్‌ను పెంచుకోవడమే ఈ పర్యటన లక్ష్యం. 2030 నాటికి $50 బిలియన్ల బైలేటరల్ ట్రేడ్ లక్ష్యాన్ని చేరుకోవాలని భారత్ భావిస్తోంది. మార్చి 2న ప్రధాన మంత్రి మోదీతో కార్నీ భేటీ కానున్నారు.

News February 28, 2026

కాకినాడ: 48 బైక్‌లు చోరీ.. ఒక్కొ కేసుకు 2 ఏళ్ల శిక్ష: సీఐ

image

కాకినాడ జిల్లాలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న శోంటిని గంగాధరన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఏకంగా 48 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. స్థానిక మేజిస్ట్రేట్ ముందు హాజరపరచగా ఒక్కో కేసుకు రెండేళ్ల చొప్పున జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అలాగే దొంగిలించిన వాహనాలను కొనుగోలు చేసిన ఆరుగురికి ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున జరిమానా విధించినట్లు సీఐ వెల్లడించారు.

News February 28, 2026

ఈరోజు నమాజ్ వేళలు (28-2-2026) శనివారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.23 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.29 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 3.51 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.23 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.35 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.