News May 1, 2024

21 జిల్లాల్లో 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

image

ఏపీవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇవాళ అత్యధికంగా పల్నాడు(D) కొప్పునూరులో 46.2 డిగ్రీలు, తిరుపతి(D) మంగనెల్లూరులో46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 21 జిల్లాల్లో 43డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. రేపు 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 234 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆయా ప్రాంతాల వివరాల కోసం ఈ <>లింక్‌‌<<>>పై క్లిక్ చేయండి.

Similar News

News January 31, 2026

ఆ నెయ్యి శాంపిల్స్ చంద్రబాబు హయాంలో తీసినవే: వెల్లంపల్లి

image

AP: TTD నెయ్యిలో జంతువుల కొవ్వు క‌లిసిన‌ట్టు CBI SIT ఛార్జ్‌షీట్‌లో ఎక్క‌డుందో చూపించాలని YCP నేత వెల్లంపల్లి శ్రీనివాస్ కూటమి నేతలకు సవాల్ విసిరారు. ‘ఛార్జ్‌షీట్లోని బ్రీఫ్ నోట్‌తో లోకేశ్ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. 208-211 పేజీల్లో ఉన్న ల్యాబ్ రిపోర్టు చ‌దువుకోవాలి. CBN హ‌యాంలో తీసిన శాంపిల్స్ పైనే సిట్ రిపోర్టు ఇచ్చింది. దేవుడు విధించే శిక్ష‌ నుంచి CBN త‌ప్పించుకోలేరు’ అని పేర్కొన్నారు.

News January 31, 2026

సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీలో పోస్టులు

image

<>సెంటర్<<>> ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ 9 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఫిబ్రవరి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech/MSc/ME/MTech/PhD, MBA/PGDM/MMS/MCom, BCom, పీజీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cmet.gov.in

News January 31, 2026

సిట్ విచారణకు కేసీఆర్?

image

TG: ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ విచారణకు హాజరుకావాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. రేపు నందినగర్‌ నివాసంలో విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే విచారించాలని కేసీఆర్ చేసిన వినతిని సిట్ తిరస్కరించిన <<19006789>>విషయం తెలిసిందే<<>>. మరోవైపు కేసీఆర్‌కు సిట్ నోటీసులకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయనున్నాయి.