News February 17, 2026

హాలియాలో ఘోర ప్రమాదం: దంపతుల మృతి

image

నల్గొండ హాలియా సాగర్ ఎడమ కాలువ వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టీవీఎస్ వాహనాన్ని లారీ వేగంగా ఢీకొనడంతో పెద్దవూర మండలం కొత్తగూడెంకు చెందిన భార్యాభర్తలు వెంకటయ్య(55), మల్లమ్మ(45) అక్కడికక్కడే మృతి చెందారు. హాలియా నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. సీఐ సతీష్ రెడ్డి, ఎస్ఐ సాయి ప్రశాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News February 19, 2026

నల్గొండ: పంట సర్వేకు వాలంటీర్ల నియామకం

image

నల్గొండ జిల్లాలో యాసంగి పంటల నమోదుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ డిజిటల్ సర్వే కోసం గ్రామానికి ఒక వాలంటీర్‌ను నియమించనున్నారు. అగ్రికల్చర్ డిగ్రీ, డిప్లొమా చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి సర్వే నమోదుకు రూ.7 చొప్పున చెల్లిస్తారు. 2 రోజుల్లో లోపు నియామకాలు పూర్తి చేసి, నెల చివరిలోగా సర్వే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాలో 5.66 లక్షల ఎకరాల పంట వివరాలు సేకరించనున్నారు.

News February 18, 2026

రైతులందరికీ ‘డిజిటల్‌’ గుర్తింపు ఉండాల్సిందే: కలెక్టర్

image

జిల్లాలోని రైతులందరూ తప్పనిసరిగా ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్’ చేయించుకోవాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. బుధవారం వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 5.54 లక్షల మంది పట్టాదారులు ఉండగా, కేవలం 2.41 లక్షల మందే నమోదు చేసుకున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలంటే ఈ నమోదు ఆవశ్యకమని, మీ-సేవ లేదా ఏఈఓల ద్వారా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.

News February 18, 2026

NLG: రేపటి వరకు రేషన్ బియ్యం పంపిణీ

image

రేషన్ బియ్యం ఈ నెల 19వ తేదీ వరకు సరఫరా చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాసన రఘునందన్ తెలిపారు. ఇప్పటివరకు రేషన్ తీసుకోని లబ్దిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏదైనా కారణాలతో రేషన్ తీసుకోని వారికి అవకాశం ఉందని తెలిపారు.