News May 1, 2024

గుంటూరు కారం ఘాటు చూపించారు: చంద్రబాబు 

image

చంద్రబాబు బుధవారం గుంటూరులోని హిమనీ సెంటర్లో నిర్వహించిన సభలో ప్రసంగించారు. ‘రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పర్యటించాను,  కానీ గుంటూరు కార్యకర్తల్లో ఉన్న జోష్ ఎక్కడా చూడలేదు’ అన్నారు. గుంటూరు కారం ఘాటును చూపించారని చమత్కరించారు. చిన్నపిల్లలు పసుపు చీర కట్టుకొని మా భవిష్యత్తు నీవే అంటూ సభకు రావడం చూసి తన జీవితం ధన్యమైందన్నారు. ఆ పార్టీ అభ్యర్థులు పెమ్మసాని చంద్రశేఖర్, నజీర్, మాధవి ఉన్నారు.

Similar News

News March 14, 2026

పదవ తరగతి పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు: గుంటూరు ఎస్పీ

image

మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే SSS పరీక్షల కోసం గుంటూరు జిల్లాలో 149 కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా SP వకుల్ జిందాల్ తెలిపారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు ఉండగా, మొబైల్ ఫోన్లు సహా ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధమని చెప్పారు. మాల్‌ ప్రాక్టీస్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

News March 14, 2026

అమరావతిలో స్థలం ఇస్తే స్టూడియో నిర్మిస్తాం: దిలీప్ రాజా

image

అమరావతిలో ప్రభుత్వం స్థలం కేటాయిస్తే స్టూడియో నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని మా-ఏపీ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా ప్రభుత్వానికి మనవి చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో సినిమా షూటింగ్‌లకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పన జరగలేదన్నారు. సినిమా షూటింగ్‌లకు ఇతర రాష్ట్రాలపై ఆధారపడటం బాధాకరమని పేర్కొన్నారు. ఇక్కడ చిత్రీకరణలు జరిగితే ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని, దీనిపై స్పందించాలని కోరారు.

News March 14, 2026

రాజధాని అమరావతి రైతులకు APCRDA విజ్ఞప్తి

image

అమరావతి ప్రాంత రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో ప్రతి శనివారం నిర్వహించే “గ్రీవెన్స్ డే” కార్యక్రమం మార్చి 14న తాత్కాలికంగా రద్దు చేశారు. రెండవ శనివారం కావడంతో నిర్వహణ కారణాల రీత్యా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రాజధాని ప్రాంత రైతులు, స్థానికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.