News February 17, 2026

పాఠశాలలలో తనిఖీలు నిర్వహించాలి: కలెక్టర్

image

స్వర్ణ వార్డుల పరిధిలో పాఠశాలల తనిఖీలను ప్రతి సోమ, గురువారాల్లో తప్పనిసరిగా నిర్వహించాలని కలెక్టర్ డా. వి.వినోద్ కుమార్ ఆదేశించారు. విద్యా నిర్వహణ, మౌలిక సదుపాయాలు, హాజరు, మధ్యాహ్న భోజన పథకంపై సమగ్ర పరిశీలన చేసి వివరాలను ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ యాప్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. సమీక్షలో డిఈవో శ్రీనివాస్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 3, 2026

కడప జిల్లాలోని AMCల్లో ఉద్యోగుల ఖాళీలు ఎన్నంటే.!

image

కడప జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో <<19285111>>110 మంది<<>> దాకా ఉద్యోగుల కొరత ఉంది. కడపలో 41 మందికి గాను 9 మంది, ప్రొద్దుటూరులో 25 మందికి గాను 6, బద్వేల్‌లో 15 మందికి గాను 4, జమ్మలమడుగులో 10 మందికి గాను 4, రాజంపేటలో 8 మందికి గాను ముగ్గురు, మైదుకూరులో 12 మందికి గాను నలుగురు, కమలాపురంలో 8 మందికి గాను ఇద్దరు, ఎర్రగుంట్లలో 8 మందికి గాను ఇద్దరు, సింహాద్రిపురంలో 6 మందికి గాను ఇద్దరు మాత్రమే ఉద్యోగులు ఉన్నారు.

News March 3, 2026

KUలో పార్ట్ టైం పోస్టుల దరఖాస్తులకు రేపే లాస్ట్

image

కేయూలోని వివిధ విభాగాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పార్ట్ టైం బోధనా సిబ్బంది నియామక దరఖాస్తు గడువును పొడిగించినట్లు రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం తెలిపారు. ఫిబ్రవరి 28తో ముగియాల్సిన గడువును అభ్యర్థుల అభ్యర్థన మేరకు మార్చి 4 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు కేయూ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

News March 3, 2026

నల్గొండ: పరీక్షకు వెళ్తుండగా విషాదం.. విద్యార్థులు మృతి

image

నిన్న నల్గొండలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంది. శాలిగౌరారం మండలానికి చెందిన వంశీ (20), రవి (20) ఇంటర్ పరీక్ష రాసేందుకు బైక్‌పై వెళ్తుండగా, స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. రూరల్ ఎస్సై సైదా బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.