News February 17, 2026

సైబరాబాద్: 76 వార్డుల్లో సెటిలర్ల ‘సైలెంట్’ సునామీ!

image

కొత్తగా ఏర్పడిన CYB కార్పొరేషన్ (CMC) ఇప్పుడు 76 వార్డులతో IT బెల్ట్‌లో తన పట్టు చాటుతోంది. ఇక్కడ రాజకీయ సమీకరణాలు పూర్తిగా ఆంధ్ర, నార్త్ ఇండియన్ సెటిలర్ల ఓట్లపైనే ఆధారపడి ఉన్నాయి. గత పోల్స్‌లో BRS తన పాత కోటను కాపాడుకోవాలని చూసినా అధికార కాంగ్రెస్ తన ‘డెవలప్‌మెంట్’ కార్డుతో సెటిలర్లను ఆకట్టుకుంది. ఇక్కడ <<19167954>>మజ్లిస్<<>> ప్రభావం లేకపోవడంతో ఫైట్ అంతా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ-బీఆర్ఎస్ మధ్యే సాగుతోంది.

Similar News

News February 19, 2026

స్టేట్ రెవెన్యూ గ్రోత్‌లో 22వ స్థానంలో ఏపీ: జగన్

image

AP: GDP, GSDPపై చంద్రబాబు చెప్పేవన్నీ తప్పుడు లెక్కలేనని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ‘2024-25లో ₹1,19,927Cr ఆదాయం వస్తుందన్నారు. కానీ వచ్చింది ₹94,937Cr. ఇక 2026-27కు ₹1,37,320Cr ఆదాయం వస్తుందని చెప్పారు. ఇప్పటికన్నా 45% అధిక ఆదాయం సాధ్యమా? ఆదాయంలో కేంద్ర పురోగతి 9.64% ఉంటే AP పురోగతి 1.97%. స్టేట్ రెవెన్యూ గ్రోత్‌లో AP 22వ స్థానంలో ఉంది. CBN అసమర్థతకు ఇదే నిదర్శనం’ అని విమర్శించారు.

News February 19, 2026

జగిత్యాల: జీతాలు రాక.. ‘ఈ-పంచాయతీ’ ఉద్యోగుల ఆకలి కేకలు

image

జిల్లాలో మండల పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న ఈ పంచాయతీ ఉద్యోగులకు 4 నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. జిల్లాలో ఈ పంచాయతీ ఆపరేటర్లుగా మొత్తం 63 మంది పనిచేస్తున్నారు. గతంలో వీరికి నెలకు రూ.8వేల జీతం ఉండేది. తర్వాత రూ.22,750 పెంచి జీతం ఇస్తున్నారు. గత ఏడాది నుంచి రూ.3,250 తగ్గించి రూ.19,500 జీతం ఇస్తున్నారు. అవి కూడా 4 నెలలుగా రావడంలేదు.

News February 19, 2026

నంద్యాల: రోజురోజుకు శనగ ధరల పతనం

image

నంద్యాల జిల్లాలో శనగ ధరలు రోజురోజుకూ పతనమవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. క్వింటాల్ రూ.5,500 నుంచి ఒక్కసారిగా రూ.4,500-4,900కు పడిపోవడంతో సాగుదారులు వాపోతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని ప్రకటించినా, క్షేత్రస్థాయిలో ఇంకా అమలు కాలేదు. దీంతో గిట్టుబాటు ధర లభించక, దిగుబడులను అమ్ముకోలేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.