News February 17, 2026
సూపర్-8లో భారత్ ప్రత్యర్థులు వీరే..

T20WC-2026లో సూపర్-8 జట్లు దాదాపుగా ఖరారయ్యాయి. రేపు నమీబియాపై గెలిస్తే <<19168498>>పాక్ సూపర్-8కు<<>> వెళ్తుంది.
సూపర్-8 గ్రూప్-1లో వెస్టిండీస్, భారత్, జింబాబ్వే, సౌతాఫ్రికా ఉన్నాయి. గ్రూప్-2లో ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్థాన్/USA, న్యూజిలాండ్ ఉంటాయి. భారత్ ఫిబ్రవరి 22న సౌతాఫ్రికా (అహ్మదాబాద్‌లో), 26న జింబాబ్వే (చెన్నైలో), మార్చి 1న వెస్టిండీస్ (కోల్‌కతాలో)తో తలపడనుంది.
Similar News
News February 19, 2026
స్టేట్ రెవెన్యూ గ్రోత్‌లో 22వ స్థానంలో ఏపీ: జగన్

AP: GDP, GSDPపై చంద్రబాబు చెప్పేవన్నీ తప్పుడు లెక్కలేనని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ‘2024-25లో ₹1,19,927Cr ఆదాయం వస్తుందన్నారు. కానీ వచ్చింది ₹94,937Cr. ఇక 2026-27కు ₹1,37,320Cr ఆదాయం వస్తుందని చెప్పారు. ఇప్పటికన్నా 45% అధిక ఆదాయం సాధ్యమా? ఆదాయంలో కేంద్ర పురోగతి 9.64% ఉంటే AP పురోగతి 1.97%. స్టేట్ రెవెన్యూ గ్రోత్‌లో AP 22వ స్థానంలో ఉంది. CBN అసమర్థతకు ఇదే నిదర్శనం’ అని విమర్శించారు.
News February 19, 2026
స్మోకింగ్ చేస్తే ఒత్తిడి తగ్గుతుందా?

సిగరెట్ తాగితే స్ట్రెస్ తగ్గుతుందని చాలా మంది అనుకుంటారు. అయితే ఇది అపోహ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సిగరెట్లలోని నికోటిన్ వల్ల డోపమైన్ రిలీజ్ అయి కాసేపు ఒత్తిడి తగ్గినట్లు అనిపిస్తుందని, దాని ప్రభావం తగ్గగానే మళ్లీ స్మోక్ చేయాలనిపిస్తుందని అంటున్నారు. ధూమపానం వల్ల దీర్ఘకాలంలో అసహనం, ఆందోళన, చిరాకు పెరుగుతాయంటున్నారు. ఊపిరితిత్తుల సమస్యలూ వస్తాయని, స్మోకింగ్ మానేయడం మంచిదని సూచిస్తున్నారు.
News February 19, 2026
వ్యాపారులూ జాగ్రత్త.. ఆ ‘పేమెంట్ సక్సెస్’ సౌండ్ ఫేక్ కావొచ్చు!

అసలైన యాప్‌లను పోలి ఉండే నకిలీ పేమెంట్ యాప్స్‌తో కేటుగాళ్లు వ్యాపారులను నిలువునా ముంచుతున్నారు. ఈ ఫేక్ యాప్స్ అచ్చం ఒరిజినల్ లాగే కనిపిస్తూ పేమెంట్ అవ్వకపోయినా ‘సక్సెస్’ స్క్రీన్‌ను, సౌండ్‌ను క్రియేట్ చేస్తాయి. దీని నుంచి తప్పించుకోవాలంటే కేవలం కస్టమర్ ఫోన్ స్క్రీన్ చూడటం కాకుండా మీ సొంత యాప్‌లోని ట్రాన్సాక్షన్ హిస్టరీని చెక్ చేసుకోవడం లేదా బ్యాంక్ నుంచి వచ్చే SMS పైనే ఆధారపడాలి.


