News February 17, 2026

NRPT: మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి

image

ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి సంబంధించి మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లతో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు.

Similar News

News February 23, 2026

మృత్యుపాశాలుగా బ్రిడ్జిలు.. ముందే హెచ్చరించిన Way2News

image

ADB ఉట్నూర్(M)లోని <<19074105>>బ్రిడ్జిలు ఇరుకుగా ఉండి<<>> ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉట్నూర్ నుంచి ADB వెళ్లే దారిలో ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. షాంపూర్, పులిమడుగు వద్ద బ్రిడ్జిలకు సైడ్‌వాల్స్ లేకపోవడంపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో ప్రమాదం అంచున ప్రయాణం అంటూ గతంలో Way2Newsలో కథనాలు ప్రచురితమయ్యాయి. అధికారులు అప్పుడే స్పందించి ఉంటే బస్సు ప్రమాదం జరిగేది కాదని విమర్శలు వస్తున్నాయి.

News February 23, 2026

తెలంగాణ కబడ్డీ జట్టు కెప్టెన్‌గా పాలమూరు బిడ్డ

image

తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెన్‌గా పాలమూరు పరిధి గద్వాల్‌కు చెందిన జి.రాజు ఎంపికైనట్లు కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డీకే స్నిగ్ధారెడ్డి ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. గుజరాత్‌లో రేపటి నుంచి ప్రారంభమయ్యే జాతీయస్థాయి సీనియర్ కబడ్డీ టోర్నీలో తెలంగాణ జట్టుకు సారథ్యం వహించనున్నారు. ఉమ్మడి జిల్లా నేతలు, కబడ్డీ అసోసియేషన్ సభ్యులు, కుటుంబ సభ్యులు, పీడీలు హర్షం వ్యక్తం చేశారు.
#CONGRATULATIONS

News February 23, 2026

మోచేతులు నల్లగా ఉన్నాయా? ఈ టిప్స్ పాటించండి

image

ముఖంపై పెట్టే శ్రద్ధ చాలామంది కాళ్లు, చేతులపై పెట్టరు. దీంతో మోచేతులు, మోకాళ్లు నల్లగా మారతాయి. దీన్ని కొన్ని ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. రోజుకి రెండు సార్లు కలబంద గుజ్జును మోచేతులు, కాళ్లకి రాస్తుంటే నలుపుదనం తగ్గుతుంది. స్పూన్ ఆలివ్ ఆయిల్‌లో కాస్త పంచదార వేసి దాంతో చేతులు, కాళ్లని స్క్రబ్ చేసి, 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి రాసినా సమస్య తగ్గుతుంది.