News May 1, 2024
క్యాన్సర్‌తో పోరాటం.. బతుకుతానని అనుకోలేదు: మనీషా

బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా గతంలో క్యాన్సర్ బారిన పడి కోలుకున్నారు. తాజాగా ఓ ఇంటర్య్వూలో క్యాన్సర్‌తో తాను పోరాడిన సమయంలో అనుభవించిన బాధను పంచుకున్నారు. ‘అండాశయ క్యాన్సర్ నాలుగో దశకు చేరడంతో జీవితంపై ఆశలు కోల్పోయా. ఎంతకాలం బతుకుతానో అనుకుంటూ కాలం గడిపాను. అదృష్టవశాత్తూ క్యాన్సర్‌ను జయించా. హీరామండీతో ప్రేక్షకుల ముందుకు రావడం ద్వారా నటిగా రెండో జీవితాన్ని పొందా’ అని చెప్పారు.
Similar News
News January 31, 2026
ఆ నెయ్యి శాంపిల్స్ చంద్రబాబు హయాంలో తీసినవే: వెల్లంపల్లి

AP: TTD నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్టు CBI SIT ఛార్జ్‌షీట్‌లో ఎక్కడుందో చూపించాలని YCP నేత వెల్లంపల్లి శ్రీనివాస్ కూటమి నేతలకు సవాల్ విసిరారు. ‘ఛార్జ్‌షీట్లోని బ్రీఫ్ నోట్‌తో లోకేశ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 208-211 పేజీల్లో ఉన్న ల్యాబ్ రిపోర్టు చదువుకోవాలి. CBN హయాంలో తీసిన శాంపిల్స్ పైనే సిట్ రిపోర్టు ఇచ్చింది. దేవుడు విధించే శిక్ష నుంచి CBN తప్పించుకోలేరు’ అని పేర్కొన్నారు.
News January 31, 2026
సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీలో పోస్టులు

<
News January 31, 2026
సిట్ విచారణకు కేసీఆర్?

TG: ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ విచారణకు హాజరుకావాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. రేపు నందినగర్ నివాసంలో విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే విచారించాలని కేసీఆర్ చేసిన వినతిని సిట్ తిరస్కరించిన <<19006789>>విషయం తెలిసిందే<<>>. మరోవైపు కేసీఆర్‌కు సిట్ నోటీసులకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయనున్నాయి.


