News February 17, 2026
ఏడుపాయల జాతర.. సేపట్లో రథోత్సవం

ఏడుపాయల వనదుర్గా భవాని మాత జాతర ముగింపు దశకు చేరుకుంది. జాతరలో ప్రధాన ఘట్టమైన రథోత్సవానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. గర్భగుడిలో ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో రథం వద్దకు చేర్చారు. ఆనవాయితీ ప్రకారం నాగసాన్‌పల్లి వతందారులు ఈ ప్రక్రియను నిర్వహించారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో రథోత్సవం ప్రారంభం కానుంది.
Similar News
News April 18, 2026
HYD: పోలీసులకు లొంగిపోయిన మాజీ MLA కొడుకు

హిట్& రన్ కేసులో మాజీ MLA షకీల్ కుమారుడు రాహెల్ జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 2022లో బెలూన్లు అమ్మే మహిళ కాజోల్ చౌహాన్ జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో రోడ్డు దాటుతుండగా MLA స్టిక్కర్ ఉన్న షకిల్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ చేతిలో ఉన్న శిశువు కిందపడి మృతిచెందగా.. ఆమె తీవ్రంగా గాయపడింది. హిట్& రన్ ఘటనలో నిందితుడిగా ఉన్న రాహెల్ పరారీలో ఉండగా, కోర్టు ఆదేశాలతో పోలీసుల ఎదుట హాజరయ్యాడు.
News April 18, 2026
నెల్లూరు: బాలికపై రేప్.. పదేళ్లు జైలు శిక్ష

నెల్లూరు రూరల్ కొత్తూరుకు చెందిన చిన్న సుబ్బయ్య(45) తన పిల్లలకు పెళ్లిళ్లు చేసి, తన అక్క ఇంట్లో ఉంటున్నాడు. అక్క కుమార్తె(16)ని 2021లో బంధువుల ఇంటికి తీసుకెళుతున్నట్లు నమ్మించి వివాహం చేసుకొని అత్యాచారం చేశారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారించిన కోర్టు నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
News April 18, 2026
HYD: పోలీసులకు లొంగిపోయిన మాజీ MLA కొడుకు

హిట్& రన్ కేసులో మాజీ MLA షకీల్ కుమారుడు రాహెల్ జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 2022లో బెలూన్లు అమ్మే మహిళ కాజోల్ చౌహాన్ జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో రోడ్డు దాటుతుండగా MLA స్టిక్కర్ ఉన్న షకిల్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ చేతిలో ఉన్న శిశువు కిందపడి మృతిచెందింది. ఆమె తీవ్రంగా గాయపడింది. హిట్& రన్ ఘటనలో నిందితుడిగా ఉన్న రాహెల్ పరారీలో ఉండగా, కోర్టు ఆదేశాలతో పోలీసుల ఎదుట హాజరయ్యాడు.


