News May 2, 2024

గరుగుబిల్లి: కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

image

గరుగుబిల్లి ఉద్యాన కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్ల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ బుధవారం పరిశీలించారు. ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి అరకు పార్లమెంటు నియోజకవర్గంతో పాటు  పార్వతీపురం, సాలూరు, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఉద్యాన కళాశాలలో ఏర్పాట్లను చేస్తున్నారు.

Similar News

News March 8, 2026

పోలీస్ పరేడ్‌లో మహిళ దినోత్సవం: కలెక్టర్

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం 10 గంటలకు విజయనగరం పోలీస్ పరేడ్‌లో జిల్లా స్థాయి వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. జిల్లా పరిపాలన యంత్రాంగం, డీఆర్‌డీఏ, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, మెప్మా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను సన్మానిస్తామన్నారు.

News March 7, 2026

కొత్తవలసలో యాక్సిడెంట్.. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ

image

కొత్తవలస మండలం అర్ధానపాలెం సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. భీమాలి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఏ.పరదేశి (38) కొత్తవలస నుంచి భీమాలి వైపు ఆటోతో వెళ్తున్నాడు. విజయనగరం నుంచి అనకాపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఆటో ఎదురుఎదురుగా ఢీకొనడంతో ఆటో డ్రైవర్ అక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.