News May 2, 2024
మతోన్మాద బీజేపీని ఓడించాలి: ప్రొఫెసర్ కోదండరాం

మతోన్మాద బీజేపీని ఓడించి ఇండియా కూటమిని బలపర్చాలని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. బుధవారం విలేకర్లతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి సంస్కరణలు, సవరణ చేస్తామని చెప్పి 400 ఎంపీ సీట్ల మెజారిటీ ఇవ్వమని అడుగుతున్నా బిజెపికి ఓటు వేయొద్దన్నారు. అసమానతలను మరింత తీవ్రంగా పెంచడానికి కేంద్రం అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
Similar News
News March 13, 2026
మెదక్: టెన్త్ విద్యార్థులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు మెదక్ డీఈఓ విజయ తెలిపారు. బాలురు తమ హాల్ టికెట్ చూపిస్తే చాలు.. రూట్లతో సంబంధం లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు. బాలికలకు ఆధార్ కార్డు ద్వారా మహాలక్ష్మి పథకం కింద ఉచిత సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు భయం వీడి, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
News March 13, 2026
పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలు: ఎస్పీ

మెదక్ జిల్లాలో పదో తరగతి పరీక్షల కోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జిల్లాలోని అన్ని కేంద్రాల వద్ద 163 BNSS అమలులో ఉంటుందని వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు.
News March 13, 2026
నర్సాపూర్: ‘గ్యాస్ కొరత సృష్టిస్తే జైలుకే’

జిల్లాలో కృత్రిమ గ్యాస్ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్ఓ నిత్యానంద్ హెచ్చరించారు. నర్సాపూర్‌లో పలు హోటళ్లు, రీఫిల్లింగ్ కేంద్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 47 సిలిండర్లను స్వాధీనం చేసుకుని, నిత్యావసర వస్తువుల చట్టం 6A కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గ్యాస్ అక్రమ విక్రయాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు.


