News May 2, 2024
ఎన్నికలకు సన్నద్ధం కావాలి: ఎన్నికల అధికారి

ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అన్ని విధాల సన్నద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ఆయా రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. నోడల్ టీమ్‌లు సమన్వయ సహకారాలతో అప్రమత్తంగా ఉంటూ పనులను పూర్తి చేయాలన్నారు.
Similar News
News March 16, 2026
నేటి నుంచి పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు

జాతీయ గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నేటి నుంచి ఏప్రిల్ 29 వరకు కొనసాగుతుందని పశుసంవర్థక శాఖ జేడీ ప్రేమ్‌చంద్ తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా పశువులకు ఉచితంగా టీకాలు వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాకు 3.20 లక్షల మందు డోసులు సరఫరా అయ్యాయని, ప్రతి గ్రామంలోని పశువులకు ముందస్తుగా టీకాలు వేయాలని సిబ్బందిని ఆదేశించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
News March 16, 2026
వైభవంగా ముగిసిన గుత్తి కోట ఉత్సవాలు

జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గుత్తి కోట ఉత్సవాలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. స్థానిక ఫుట్‌బాల్ క్రీడా ప్రాంగణంలో జరిగిన ఈ ముగింపు వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరాం, దగ్గుపాటి వెంకటప్రసాద్ పాల్గొన్నారు. వివిధ సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ చాటిన కళాకారులకు వీరి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఉత్సవాలు విజయవంతం కావడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
News March 15, 2026
ATP: ఈనెల 16న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఈనెల 16న జిల్లా వ్యాప్తంగా వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రధాన కార్యక్రమం జరగనుంది. నియోజకవర్గ విజన్ యూనిట్లలో విజయవాడలో నిర్వహించే 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఉదయం 11 గంటలకు ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.


