News May 2, 2024
మే 2: చరిత్రలో ఈరోజు

*1519: చిత్రకారుడు, వృక్ష శాస్త్రజ్ఞుడు లియొనార్డో డావిన్సీ మరణం.
*1911: తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు పి. పుల్లయ్య జననం.
*1921: భారత సినిమా దర్శకుడు సత్యజిత్ రే జననం.
*1969: వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియన్ లారా జననం.
*2002: నటి దేవిక మరణం.
Similar News
News February 1, 2026
పెళ్లైన 60 రోజులకే భర్తను గొంతు కోసి చంపిన భార్య

UP బరేలీలో పెళ్లైన 2 నెలలకే భార్య తన భర్తను చంపేసింది. 9 ఏళ్లు ప్రేమించుకున్న జితేంద్ర, జ్యోతి గతేడాది NOVలో పెళ్లి చేసుకున్నారు. జితేంద్ర ఆన్‌లైన్ జూదానికి బానిసై, భార్య ఖాతా నుంచి రూ.20 వేలు తీసుకున్నాడు. దీనిపై వివాదం చెలరేగగా కుటుంబ సభ్యులతో కలిసి ఆమె భర్త గొంతు కోసి చంపేసింది. మృతదేహాన్ని కిటికీకి వేలాడదీసి సూసైడ్‌గా చిత్రీకరించింది. పోస్టుమార్టం నివేదికలో నిజం తేలడంతో వారిని అరెస్ట్ చేశారు.
News February 1, 2026
ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి: పేర్ని నాని

AP: వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై టీడీపీ కార్యకర్తలు చేసిన దాడులను పేర్ని నాని ఖండించారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ‘టీడీపీ దాడులను అడ్డుకోవద్దని పైస్థాయి నుంచి ఆదేశాలున్నాయని సిబ్బంది చెబుతున్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి. కేంద్ర బలగాలను పంపాలి. లేదంటే వేలాది మంది ప్రాణాలకు ముప్పు’ అని పేర్కొన్నారు.
News February 1, 2026
పాక్ ఆరోపణలు అబద్ధం: భారత్ ఘాటు జవాబు

బలూచిస్థాన్ <<19017774>>దాడుల్లో<<>> భారత్ హస్తం ఉందన్న పాక్ ఆరోపణలను ఇండియా కొట్టిపారేసింది. ఇవన్నీ ఆధారాల్లేని తప్పుడు వాదనలని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. తన అంతర్గత వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే పాక్ ఇలాంటి గిల్లీకజ్జాలు పెట్టుకుంటోందని విమర్శించింది. దాడుల్లో 15 మంది సైనికులు, 100కు పైగా మిలిటెంట్లు మరణించినట్లు సమాచారం. నిందలు ఆపి మానవ హక్కుల ఉల్లంఘనలపై దృష్టి పెట్టాలని భారత్ సూచించింది.


