News May 2, 2024

చంద్రబాబు హామీలను బీజేపీ కూడా నమ్మడం లేదు: కేశినేని

image

AP: చంద్రబాబు ఇచ్చే హామీలను బీజేపీ కూడా నమ్మడం లేదని వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని విమర్శించారు. అందుకే బీజేపీ నేతల ఫొటోలు లేకుండా మేనిఫెస్టో రిలీజ్ చేశారని అన్నారు. చంద్రబాబు పచ్చి మోసగాడని ప్రజలంతా చెప్పుకునే పరిస్థితి నెలకొందన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడే దమ్మున్న వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి పేదల కోసం ఇన్ని పథకాలు అమలు చేయలేదన్నారు.

Similar News

News February 5, 2026

వాట్సాప్‌లో త్వరలో మరో కొత్త ఫీచర్

image

స్టేటస్ అప్‌డేట్స్‌కు సంబంధించి వాట్సాప్‌లో ‘custom lists’ ఫీచర్ త్వరలో రానుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొలీగ్స్ ఇలా వేర్వేరు లిస్టులు క్రియేట్ చేసుకొని, వాటిలో మీకు కావాల్సిన లిస్టుకు స్టేటస్ షేర్ చేయవచ్చు. ప్రస్తుతం ‘మై కాంటాక్ట్స్, ఆల్ కాంటాక్ట్స్ ఎక్స్‌పెక్ట్, ఓన్లీ షేర్ విత్’ ఆప్షన్లు ఉండగా, స్టేటస్ పెట్టే టైమ్‌లో సెట్టింగ్స్ తరచుగా మార్చాల్సి వస్తోంది. ఈ కొత్త ఫీచర్ వస్తే ఇక ఆ ఇబ్బంది ఉండదు.

News February 5, 2026

శారీరక అంగీకారం వేధింపులకు లైసెన్స్ కాదు: HC

image

శారీరక సంబంధానికి అంగీకరించినంత మాత్రాన వేధింపులకు అనుమతి ఇచ్చినట్లు కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఓ మహిళపై లైంగిక వేధింపులు, బెదిరింపుల కేసులో నిందితుడి బెయిల్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. పరస్పర అంగీకారంతో సంబంధం కొనసాగిందన్న వాదనను తోసిపుచ్చింది. అంగీకారం ఉన్నా లైంగిక దాడులు నేరమేనని తెలిపింది. ఏకాంత వీడియోలు తీసి బలవంతం చేయడం ఏకాభిప్రాయం కిందకు రాదని తేల్చి చెప్పింది.

News February 5, 2026

డ్రీమ్‌లైనర్ ఫ్యూయల్‌ స్విచ్‌పై ఎయిర్ ఇండియా క్లారిటీ

image

బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాల్లో ఫ్యూయల్ స్విచ్ సమస్యలు లేవని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. లండన్ నుంచి భారత్‌కు వచ్చిన ఓ ఫ్లైట్‌లో స్విచ్ లోపం ఉందని వస్తున్న వార్తలపై బ్రిటన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ వివరణ కోరింది. దీనిపై సంస్థ క్లారిటీ ఇచ్చింది. కాగా ఈ నెల 2న పైలట్ ఫ్యూయల్ స్విచ్ సరిగా లాక్ కాకపోవడంతో విమానాన్ని బెంగళూరులో నిలిపివేశారు. తనిఖీలు చేయగా లోపాలేవీ లేవని ఎయిర్ ఇండియా తెలిపింది.