News February 18, 2026

ఐఎఫ్ఆర్ అంటే ఏమిటి?

image

International Fleet Review అనేది ప్రపంచ దేశాల నౌకాదళాలు ఒకచోట చేరి తమ యుద్ధనౌకలు, సాంకేతిక సామర్థ్యం, సముద్ర భద్రతలో సత్తాను ప్రదర్శించే ప్రతిష్టాత్మక నౌకాదళ కార్యక్రమం. దేశాల నౌకలు సముద్రంలో వరుసగా ప్రయాణిస్తుండగా, వాటిలోని సిబ్బంది ఆతిథ్య దేశ రాష్ట్రపతికి గౌరవ వందనం చేస్తారు. నౌకాదళ సహకారం, భద్రత, వ్యూహాలపై దేశాల మధ్య చర్చలు కూడా జరుగుతాయి. ఈసారి ఐఎఫ్ఆర్‌, మిలాన్, ఐఓఎన్‌ఎస్ కలిపి చేస్తున్నారు.

Similar News

News March 22, 2026

సినిమా కోసం 10 కేజీల బరువు తగ్గిన ఎన్టీఆర్!

image

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం Jr.NTR స్ట్రిక్ట్ డైట్ పాటిస్తున్నారని ఆయన ట్రైనింగ్ టీమ్ వెల్లడించినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. 7 వారాల్లో 10kgs బరువు తగ్గారని తెలిపాయి. డైరెక్టర్ లీన్ ఫిజిక్ కావాలని చెప్పడంతో రోజూ 90min ఫంక్షనల్ ట్రైనింగ్ చేస్తూ కంట్రోల్ డైట్ పాటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ HYDలో జరుగుతోంది. ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

News March 22, 2026

భద్రకాళీ తీరం ఆహ్లాదం.. ఆధ్యాత్మికం..!

image

వరంగల్ నగర నడిబొడ్డున 12వ శతాబ్దంలో కాకతీయ రాజు గణపతి దేవుడు నిర్మించిన భద్రకాళి చెరువు తీరం ఆహ్లాదంతో పాటు, ఆధ్యాత్మికతను అందిస్తుంది. సుమారు 32 ఎకరాల విస్తీర్ణంలో రెండు కిలోమీటర్ల పొడవులో మానవ నిర్మిత ఈ కృత్రిమ సరస్సు. చెరువు ఒడ్డున భద్రకాళి అమ్మవారు, బండ్, కొండలు, రాతి నిర్మాణాలు టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఇటీవల చెరువు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు.
# నేడు ప్రపంచ జల దినోత్సవం.

News March 22, 2026

అర్ధరాత్రి ఆపి మరీ ముఖం కడిగిస్తున్నారు..!

image

నిద్రమత్తు వల్ల కలిగే ప్రమాదాలను అరికట్టేందుకు జిల్లా SP రాహుల్ మీనా ఆదేశాలతో పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ‘స్టాప్ వాష్ అండ్ గో’ పేరుతో అర్ధరాత్రి, తెల్లవారుజామున జాతీయ రహదారులపై వాహనాలను నిలిపి డ్రైవర్లతో ముఖం కడిగిస్తున్నారు. లారీలు, బస్సులు, కార్ల డ్రైవర్లను నిద్రమత్తు నుంచి అప్రమత్తం చేస్తూ పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. దీంతో ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.