News February 18, 2026

ఐఎఫ్ఆర్ అంటే ఏమిటి?

image

International Fleet Review అనేది ప్రపంచ దేశాల నౌకాదళాలు ఒకచోట చేరి తమ యుద్ధనౌకలు, సాంకేతిక సామర్థ్యం, సముద్ర భద్రతలో సత్తాను ప్రదర్శించే ప్రతిష్టాత్మక నౌకాదళ కార్యక్రమం. దేశాల నౌకలు సముద్రంలో వరుసగా ప్రయాణిస్తుండగా, వాటిలోని సిబ్బంది ఆతిథ్య దేశ రాష్ట్రపతికి గౌరవ వందనం చేస్తారు. నౌకాదళ సహకారం, భద్రత, వ్యూహాలపై దేశాల మధ్య చర్చలు కూడా జరుగుతాయి. ఈసారి ఐఎఫ్ఆర్‌, మిలాన్, ఐఓఎన్‌ఎస్ కలిపి చేస్తున్నారు.

Similar News

News April 6, 2026

కమలం పార్టీకి 47 ఏళ్లు

image

ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ 1980 ఏప్రిల్ 6న ఏర్పడింది. అటల్ బిహారి వాజ్‌పేయి, LK అద్వానీ దీన్ని స్థాపించారు. 1984లో తొలిసారి సాధారణ ఎన్నికలను ఎదుర్కొని కేవలం 2 సీట్లలోనే గెలిచింది. రామజన్మభూమి ఉద్యమంతో 1989లో 75 సీట్లు వచ్చాయి. 1996లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 1996, 98, 99లో వాజ్‌పేయి మూడు సార్లు ప్రధాని అయ్యారు. 2014 నుంచి మోదీ ప్రధానిగా కొనసాగుతున్నారు.

News April 6, 2026

గుంటూరులో ఫేక్ యాప్‌ల కిలాడీ అరెస్ట్

image

గుంటూరు పట్టాభిపురం పోలీసులు ఆదివారం రాత్రి నిర్వహించిన గస్తీలో ఓ మోసగాడిని అదుపులోకి తీసుకున్నారు. పల్నాడుకు చెందిన నిందితుడు శరత్‌బాబుపై ఏపీ, తెలంగాణల్లో 35 కేసులున్నాయన్నారు. అతను వ్యాపారుల వద్దకు వెళ్లి ఫేక్ పేమెంట్ యాప్ ద్వారా డబ్బు బదిలీ చేసినట్లు నమ్మిస్తాడన్నారు. అనంతరం వారి నుంచి నగదు తీసుకుని ఉడాయిస్తాడు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

News April 6, 2026

జమ్మికుంట: బాలికపై లైంగిక వేధింపులు.. 13 మందిపై కేసు..!

image

జమ్మికుంట(M)లో 13 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసు సంచలనం రేపింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి సుమారు 13మంది అనుమానితులపై దర్యాప్తు మొదలు పెట్టారు. బంధువులు, పాఠశాల సిబ్బందిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెదిరింపులతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. HZB సబ్ డివిజన్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ నిందితులపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. పూర్తి వివరాలు తెలియాలి.