News February 18, 2026

జైత్రయాత్రతో చరిత్రలో నిలిచిన జిల్లా జగిత్యాల

image

ఉద్యమం అనగానే గుర్తుకొచ్చే జిల్లా జగిత్యాల. జగిత్యాల జైత్రయాత్రతో చరిత్రలో నిలిచిన ఈ జిల్లా 2016లో ఉమ్మడి కరీంనగర్ నుంచి విడిపోయి స్వతంత్రంగా ఏర్పడింది. 17వ శతాబ్దంలో జగదేవుడు పాలించిన నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని ఆయన పేరుతో జగిత్యాలగా పిలుస్తారు. వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల.. శాతవాహనుల తొలి రాజధానిగా ప్రసిద్ధి. జిల్లాలో వ్యవసాయం ప్రధాన వృత్తి కాగా, మొక్కజొన్న, వరి పంటలు ఎక్కువగా సాగు అవుతున్నాయి.

Similar News

News February 22, 2026

పాకిస్థాన్ అందుకే ఓడిపోతోంది: షోయబ్ అక్తర్

image

భారత్‌తో పాకిస్థాన్ మ్యాచ్ ఓడిపోతుండటానికి టీమ్ సెలక్షనే కారణం అని ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నారు. జట్టు ఎంపిక సరిగ్గా లేదని.. అసలు ఏం చేస్తున్నామో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీమ్ సెలక్షన్ సరిగ్గా ఉంటే ఏ జట్టునైనా ఓడించగల సమర్థత పాక్‌కు ఉందన్నారు. ICC టోర్నీల్లో పాక్ భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోతున్న సంగతి తెలిసిందే. కాగా పాక్ <<19206100>>సెమీస్<<>> చేరాలంటే ENG, SLపై కచ్చితంగా గెలవాలి.

News February 22, 2026

అప్పుడు కూలదోసింది.. ఇప్పుడు కూడానా?

image

రాజీకి రాకపోతే ఇరాన్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి US సిద్ధంగా ఉంది. అయితే ఇది అమెరికాకు కొత్తేం కాదు. 1953లో అప్పటి పీఎం మొస్సాదేగ్ సర్కార్‌ను పడగొట్టింది. ఇరాన్ నేతలు, మిలిటరీ మద్దతు కూడగట్టి పత్రికల్లో మొస్సాదేగ్‌కు వ్యతిరేక కథనాలు ప్రచురించి అసమ్మతిని పెంచింది. ఆయిల్ కంట్రోల్ కోసం, USSR ప్రభావం పడకూడదని బ్రిటన్‌తో కలిసి ఆపరేషన్ ఎజాక్స్ చేపట్టింది. రెజా పహ్లావి రాచరికానికి మద్దతు ఇచ్చింది.

News February 22, 2026

వీరికే కవలలు పుట్టే ఛాన్స్ ఎక్కువ

image

స్త్రీకి మాతృత్వం అనేది దేవుడిచ్చిన వరం. సాధారణంగా గర్భంలో ఒకబిడ్డే ఉంటుంది. కొన్ని సార్లు మాత్రమే కవలలు లేదా మల్టిపుల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీలో ట్విన్స్ ఉంటే వారికి ఛాన్స్ ఎక్కువ. అలాగే గర్భిణి BMI 30కంటే ఎక్కువగా ఉన్నా, వయసు ఎక్కువగా ఉన్నా, ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్ సహాయంతో గర్భందాల్చినా ట్విన్స్ పుట్టే అవకాశం ఎక్కువని చెబుతున్నారు.