News May 2, 2024
HYD: జాతీయ రహదారికి రైతుబంధు.. క్లారిటీ.!

HYD నుంచి శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారిలో కడ్తాల్, అమనగల్లు ప్రాంతంలో రోడ్డుకు సైతం రైతుబంధు వస్తుందన్న అంశంపై అధికారులు స్పందించారు. రైతుల భూమి నుంచి జాతీయ రహదారి నిర్మించిన సమయంలో భూములు కట్ కాకపోవడంతో, పలువురికి రైతుబంధు అందుతుంది. అయితే రహదారి సర్వే చేస్తామని, రోడ్డు ఉన్న భూమి రైతుల పేరిట ఉంటే తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమనగల్లు తహశీల్దార్ లలిత తెలిపారు.
Similar News
News March 13, 2026
ఉస్మానియా తరలింపు వెనక అసలు ప్లాన్ ఇదే!

ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌కు తరలించే ప్రక్రియ ఈ బడ్జెట్ సమావేశాల్లో అత్యంత కీలకం కానుంది. అఫ్జల్‌గంజ్‌లోని 26 ఎకరాల భూమిని ‘హెల్త్ టూరిజం’ పేరుతో కార్పొరేట్ సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం లోలోపల కసరత్తు చేస్తోందని సమాచారం. పాత వారసత్వ భవనాన్ని కేవలం మ్యూజియంగా మార్చి, మిగిలిన ఖాళీ స్థలంలో వాణిజ్య సముదాయాలు నిర్మించే ప్రతిపాదన బడ్జెట్ ప్రసంగంలో ‘పరోక్షంగా’ వెల్లడికానుంది.
News March 13, 2026
HMDA వర్సెస్ కార్పొరేషన్: ఫీజులన్నీ ఎవరికి?

10 అంతస్తులకు మించిన బిల్డింగ్ అనుమతులను HMDA తన గుప్పిట్లోకి తీసుకోవడంపై లోకల్ బాడీలు రగిలిపోతున్నాయి. గతంలో కార్పొరేషన్లకు అందే బిల్డింగ్ పర్మిషన్ ఫీజులు ఇప్పుడు HMDA ఖాతాలోకి వెళ్లడం వల్ల తమ అభివృద్ధి పనులకు నిధులు కరువవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఇది కేవలం ప్లానింగ్ కోసం చేసిన మార్పు కాదు, బడా ప్రాజెక్టుల ఆదాయాన్ని కేంద్రీకరించే వ్యూహం అని స్పష్టమవుతోంది.
News March 13, 2026
గ్యాస్ కొరత.. అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష

ఇరాన్‑ యుఎస్, ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో గ్యాస్ కొరతపై సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈరోజు సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావు, గ్యాస్ కంపెనీల ప్రతినిధులు, కలెక్టర్లతో కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణలో 86% డొమెస్టిక్, 14% కమర్షియల్ సప్లై ఉండగా, ప్రస్తుత నిల్వలు, సరఫరా ఇబ్బందులను పరిశీలించి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.


