News May 2, 2024
RR: జాతీయ రహదారికి రైతుబంధు.. క్లారిటీ.!

HYD నుంచి శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారిలో కడ్తాల్, అమనగల్లు ప్రాంతంలో రోడ్డుకు సైతం రైతుబంధు వస్తుందన్న అంశం పై అధికారులు స్పందించారు. రైతుల భూమి నుంచి జాతీయ రహదారి నిర్మించిన సమయంలో భూములు కట్ కాకపోవడంతో, పలువురికి రైతుబంధు అందుతుంది. అయితే రహదారి సర్వే చేస్తామని, రోడ్డు ఉన్న భూమి రైతుల పేరిట ఉంటే తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమనగల్లు తహసీల్దార్ లలిత తెలిపారు.
Similar News
News March 24, 2026
RR: వాహనాల వేలానికి సిద్ధమైన ఆర్టీఏ

ఆర్టీఏ పరిధిలోని సీజ్డ్ వాహనాలను బహిరంగ వేలం వేసేందుకు అధికారులు సిద్దమయ్యారు. ఆర్టీసీ డిపోల్లో ఏళ్లుగా పోగుపడిన వాహనాలతో పార్కింగ్ సమస్య తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్& ఆర్టీఏ సెక్రటరీ సదానంద తెలిపారు. జాబితాలో పేర్లున్న వాహనాల యజమానులు, ఫైనాన్షియర్లు మార్చి 27లోపు అధికారుల నుంచి రిలీజ్ ఆర్డర్ తీసుకోవాలని ఆయన కోరారు.
News March 22, 2026
ఖైరతాబాద్: గంజాయి ముఠా గుట్టురట్టు!

ఖైరతాబాద్‌లోని M.S.మక్తాలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముఠాను లేక్ పోలీస్, టాస్క్ ఫోర్స్ బృందాలు సంయుక్తంగా దాడులుచేసి పట్టుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో ఒడిశా నుంచి గంజాయిని తెప్పించి విక్రయిస్తున్న ముగ్గురి నిందితులను అరెస్ట్ చేయగా, వారినుంచి 1.4 కిలోల ఎండిన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు. దొరికిన వారిపై కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు.