News May 2, 2024
రూ.24 లక్షలు ఇప్పిస్తా: ఆది నారాయణ రెడ్డి

తాను MLAగా గెలిస్తే రాజోలు ప్రాజెక్టులో భూ నిర్వాసితులకు రూ.24 లక్షలు, గండికోట భూ నిర్వాసితులకు రూ.12లక్షలు పరిహారం ఇస్తానని హామీ ఇచ్చారు. పెద్దముడియం మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్లకు రిపేర్లు ఉన్నాయా, తాగునీరు, సాగునీరు, ఇళ్లు, డ్రిప్ ఇలా ఏ ఒక్కటైనా చేశావా’ అని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు.
Similar News
News November 13, 2025
ప్రొద్దుటూరులో రేషన్ మాఫియా..!

ప్రొద్దుటూరులో రేషన్ మాఫియా విజృంభిస్తోంది. వాళ్ల దెబ్బకు అధికారులు సైతం హడలి పోతున్నారు. ఇటీవల రేషన్ బియ్యం తరలిస్తుండగా 1టౌన్, 3టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ప్రొద్దుటూరు మండలంలో 143 రేషన్ షాపులున్నాయి. వీటి పరిధిలో 68,675 రేషన్ కార్డులున్నాయి. నవంబర్ నెలకు 9,839 క్వింటాళ్ల బియ్యం, 648 క్వింటాళ్ల చక్కెర, 1,427 క్వింటాళ్ల జొన్నలు వచ్చాయి. వీటిలో ఎక్కువ భాగం పక్కదారి పట్టాయని సమాచారం.
News November 13, 2025
19న అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలు

కడప వైవీయూ ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీన అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలు జరగనున్నాయి. బద్వేలు బిజివేముల వీరారెడ్డి డిగ్రీ కాలేజీలో ఈ పోటీలు నిర్వహిస్తారు. పురుషులు, మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయని వైవీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ కె.రామసుబ్బారెడ్డి తెలిపారు. క్రీడాకారులు వైవీయూ అనుబంధ కళాశాలల్లో చదివి, 17 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లు అర్హులన్నారు.
News November 13, 2025
కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీ మృతి

కడపలోని కేంద్ర కారాగారంలో ఉన్న జీవిత ఖైదీ గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. పోలీసుల కథనం.. కడప సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న చిన్న సుంకిరెడ్డికి ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో కడప రిమ్స్‌కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు నంద్యాల జిల్లా కోవెలకుంట్ల(M) భీమునిపాడుకు చెందిన వ్యక్తిగా అధికారులు వెల్లడించారు.


