News February 18, 2026

అల్లూరి: A2గా MLC అనంత బాబు భార్య.. కోర్టులో ఛార్జ్‌షీట్!

image

ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసులు కీలక అడుగు వేశారు. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు భార్యను రెండో నిందితురాలిగా (A2) పేర్కొంటూ రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టులో తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. సుబ్రహ్మణ్యం హత్య ఘటన గతంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజా ఆ ఛార్జ్ షీట్‌తో ఈ కేసు విచారణలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది.

Similar News

News February 20, 2026

NLG: ఈనెల 22న గురుకుల ప్రవేశ పరీక్ష

image

గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశానికి వీటీజీ సెట్-26 పరీక్ష ఈ నెల 22న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయకర్త జె.శోభారాణి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 33 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని.. మొత్తం 12,600 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్ష రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్, ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు.

News February 20, 2026

నల్గొండ: రైతులు ఖాతాల్లో ‘సన్నాల’ బోనస్ రూ.71.47 కోట్లు జమ

image

వానాకాలం సీజన్‌లో సన్న రకం ధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వం బోనస్ నగదు విడుదల చేసింది. జిల్లాలోని 31,416 మంది రైతుల ఖాతాల్లో రూ.71.47 కోట్లను నేరుగా జమ చేసింది. ఇప్పటికే ధాన్యం విలువ కింద రూ.355.18 కోట్లు చెల్లించగా, తాజా బోనస్‌తో రైతులకు అదనపు లబ్ధి చేకూరింది. ప్రభుత్వ నిర్ణయంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News February 20, 2026

ఆస్ట్రేలియాను ఓడించేందుకు ఇదే కరెక్ట్ టైమ్: ఒమన్ కెప్టెన్ జతీందర్

image

T20 WCలో ఆడిన 3 మ్యాచులూ ఓడి ఇంటిబాట పట్టిన ఒమన్ నేడు ఆస్ట్రేలియాతో తలపడనుంది. కనీసం దీంట్లోనైనా గెలిచి కంగారూలకు షాక్ ఇవ్వాలని ఆశిస్తోంది. అందుకు తమ ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారని కెప్టెన్ జతీందర్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం వీక్‌గా ఉన్న ‘ఆసీస్‌ను ఓడించేందుకు ఇదే సరైన సమయం’ అని అభిప్రాయపడ్డారు. దీన్ని గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు చెప్పారు. T20 క్రికెట్‌లో ఏదైనా సాధ్యమేనని ధీమా వ్యక్తం చేశారు.