News May 2, 2024

వైసీసీ నుంచి వడమాలపేట ZPTC సస్పెండ్

image

నగరి నియోజకవర్గం వడమాలపేట ZPTC మురళి రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడినట్లు ఫిర్యాదు అదడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అతనిపై అభియోగాలు వాస్తవమని క్రమశిక్షణ కమిటీ ధ్రువీకరించడంతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అలాగే అతని పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు స్పష్టం చేశారు.

Similar News

News March 14, 2026

చిత్తూరు: పౌల్ట్రీ రైతులకు కష్టాలు!

image

చిత్తూరు జిల్లాలో పెద్ద సంఖ్యలో రైతులు పౌల్ట్రీ ఫారాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి వారిని కష్టాలు వీడటం లేదు. జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రభావంతో కొద్దిరోజులు చికెన్ విక్రయాలు తగ్గిపోవడంతో నష్టపోయారు. యుద్ధ ప్రభావంతో కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. వారం రోజుల క్రితం డజన్ కోడిగుడ్ల రిటైల్ ధర రూ.72 ఉండగా ప్రస్తుతం అది రూ.66కు చేరుకుంది.

News March 14, 2026

చిత్తూరు: 108లో ఉద్యోగాలు

image

చిత్తూరు జిల్లాలో 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్(EMT), పైలట్(Driver) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విజయవాడలోని గొల్లపూడి ఏరియా మైనార్టీ కమ్యూనిటీ హాల్లో శని ఆదివారం సెలక్షన్స్ నిర్వహిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఇంటర్వ్యూ‌కు హాజరు కావాలని జిల్లా మేనేజర్ మోహన్ బాబు, ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ జగదీశ్ కోరారు.

News March 14, 2026

పూతలపట్టు ఎమ్మెల్యేపై కేసు కొట్టివేత

image

పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌పై నమోదైన కేసును చిత్తూరు జిల్లా ఫస్ట్ సెషన్స్ కోర్టు శుక్రవారం కొట్టివేసింది. యాదమరి మండలం కాశిరాళ్ల వద్ద 2023లో ధర్నా నిర్వహించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారనే ఆరోపణలతో యాదమరి పోలీసులు కేసు నమోదు చేశారు. సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌తో పాటు ఇతర నాయకులపై నమోదైన కేసును రద్దు చేసింది.