News May 2, 2024

హైదరాబాద్‌‌లో CM రేవంత్ రెడ్డి మార్క్

image

HYDలో CM రేవంత్ రెడ్డి మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు ఆకర్షితులై ఇప్పటికే 12 మంది BRS కార్పొరేటర్లు‌ హస్తం కండువా కప్పుకొన్నారు. తాజాగా‌ వనస్థలిపురం BJP కార్పొరేటర్‌ వెంకటేశ్వర్ రెడ్డి రేవంత్ సమక్షంలో‌ పార్టీలోకి చేరారు. MP ఎన్నిక‌ల్లో రాజధానిలోని 4 స్థానాల్లో విజయమే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న CM చేరికలపైనా దృష్టి పెట్టారు.

Similar News

News March 24, 2026

రంగారెడ్డి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉచిత శిక్షణ

image

చిల్కూర్‌లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో మార్చి 25 నుంచి గ్రామీణ యువకులకు ఉచిత CCTV శిక్షణ ప్రారంభం కానుంది. రంగారెడ్డి జిల్లా వారికి 30 రోజుల శిక్షణ, ఉచిత హాస్టల్, భోజనం, యూనిఫాం, టూల్‌కిట్స్ అందిస్తారు. 18-45 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి గల వారు అవసరమైన ధృవపత్రాలతో నమోదు చేసుకోవాలని డైరెక్టర్ మొహమ్మద్ అలీ ఖాన్ తెలిపారు. పూర్తి వివరాలకు 8500165190 నంబర్‌కు సంప్రదించాలన్నారు.

News March 24, 2026

RR: వాహనాల వేలానికి సిద్ధమైన ఆర్టీఏ

image

ఆర్టీఏ పరిధిలోని సీజ్డ్ వాహనాలను బహిరంగ వేలం వేసేందుకు అధికారులు సిద్దమయ్యారు. ఆర్టీసీ డిపోల్లో ఏళ్లుగా పోగుపడిన వాహనాలతో పార్కింగ్ సమస్య తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్& ఆర్టీఏ సెక్రటరీ సదానంద తెలిపారు. జాబితాలో పేర్లున్న వాహనాల యజమానులు, ఫైనాన్షియర్లు మార్చి 27లోపు అధికారుల నుంచి రిలీజ్ ఆర్డర్ తీసుకోవాలని ఆయన కోరారు.

News March 22, 2026

ఖైరతాబాద్‌: గంజాయి ముఠా గుట్టురట్టు!

image

ఖైరతాబాద్‌లోని M.S.మక్తాలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముఠాను లేక్ పోలీస్, టాస్క్ ఫోర్స్ బృందాలు సంయుక్తంగా దాడులుచేసి పట్టుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో ఒడిశా నుంచి గంజాయిని తెప్పించి విక్రయిస్తున్న ముగ్గురి నిందితులను అరెస్ట్ చేయగా, వారినుంచి 1.4 కిలోల ఎండిన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు. దొరికిన వారిపై కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు.