News May 2, 2024
నేడు విజయనగరం, చీపురుపల్లిలో బాలకృష్ణ సభ

ఎన్నికల ప్రచారంలో భాగంగా నందమూరి బాలకృష్ణ నేడు విజయనగరంలో పర్యటించనున్నారు. సాయంత్రం 5 గంటలకు సభ జరగుతుందని స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు. చీపురుపల్లిలో జరిగే సభ అనంతరం కొత్తపేట నీళ్ల ట్యాంకు, అంబటి సత్రం కూడలి, మూడు లాంతర్ల కూడలి మీదుగా సభస్థలానికి చేరుకుంటారని వెల్లడించారు. ఈ మేరకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటనలో భాగంగా నిన్న విశాఖ చేరుకున్నారు.
Similar News
News April 21, 2025
డీఎస్సీ ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆనందం: కిమిడి

కూటమి ప్రభుత్వం DSC ప్రకటన విడుదల చేయడంతో నిరుద్యోగుల్లో ఎనలేని ఆనందం వ్యక్తం అవుతుందని TDP జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. చీపురుపల్లిలోని తన నివాసంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు, నారా లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 16,346 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటన విడుదల చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు.
News April 21, 2025
VZM: 18 మందికి రూ.63లక్షల రుణాలు

విజయనగరం కలెక్టరేట్లో 18 మంది దివ్యాంగులకు రూ.63 లక్షల విలువగల రుణాలను కలెక్టర్ అంబేడ్కర్ సోమవారం పంపిణీ చేశారు. అలాగే విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ ద్వారా డిగ్రీ ఆపై కోర్సులు రెగ్యులర్‌గా చదువుతున్న 29 మంది దివ్యాంగులకు 29 ల్యాప్టాప్‌లు, మూగ, చెముడు అభ్యర్థులకు ఆరు టచ్ ఫోన్లు, ట్రై సైకిళ్లను అందజేశారు.
News April 21, 2025
విజయనగరం పీజీఆర్ఎస్‌కు 205 వినతులు

విజయనగరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన PGRSకు 205 వినతులు అందాయి. కలెక్టర్ అంబేడ్కర్, JC సేతు మాధవన్, డిప్యూటీ కలెక్టర్లు మురళీ, ప్రమీల గాంధీ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 205 అర్జీలు అందగా, భూ సమస్యలకు సంభందించి రెవెన్యూ శాఖకు అత్యధికంగా 138 వినతులు అందాయి. జేసీ సమీక్షిస్తూ గడువు లోపలే వినతులను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.