News May 2, 2024
సింహాచలం: చందనోత్సవంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత

సింహాచలం అప్పన్న బాబు చందనోత్సవ కార్యక్రమంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ తెలిపారు. ఈనెల 10న సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకొని చందనోత్సవాన్ని విజయవంతం చేస్తామన్నారు. సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా అదనంగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News March 24, 2026
విశాఖ: ట్రాన్స్‌జెండర్‌లకు CNG ఆటోలు పంపిణీ చేసిన మంత్రి

విశాఖ పర్యటనకు వచ్చిన జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కలెక్టరేట్‌లో అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ముగ్గురు ట్రాన్స్‌జెండర్‌లకు CNG ఆటోలు పంపిణీ చేశారు. అదేవిధంగా ముగ్గురు దివ్యాంగులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణ బాబు, విష్ణు కుమార్ రాజు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చి పాల్గొన్నారు.
News March 24, 2026
సింహాచలం చందనోత్సవ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

సింహాచలం వార్షిక చందనోత్సవం ఏప్రిల్ 20న జరగనుంది. ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మంగళవారం విశాఖ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చిని ఆయన ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యేలు వెలగపూడి, విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు.
News March 24, 2026
మార్చి ఆఖరు నాటికి ఓటర్ల జాబితా మ్యాపింగ్ పూర్తి చేయాలి: కలెక్టర్

మార్చి నెల ఆఖరు నాటికి జిల్లాలోని ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ నెల నుంచి జన గణన-2027 ప్రక్రియ మొదలవుతుందని, ఈ లోగా ఓటర్ల జాబితాలకు సంబంధించిన పనులను పూర్తి చేసుకోవాలన్నారు.సంబంధిత శాఖల అధికారులు కింది స్థాయి అధికారులతో,సచివాలయ సిబ్బందితో సమన్వయం చేసుకొని ప్రక్రయను వేగవంతం చేయాలని ఆదేశించారు.


