News February 18, 2026
సూర్యాపేట: నెల రోజుల్లో మాతా శిశు కేంద్రం సిద్ధం కావాలి: కలెక్టర్

సూర్యాపేట మాతా శిశు కేంద్రం భవన పనులను నెల రోజుల్లో పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. బుధవారం ఆసుపత్రిని తనిఖీ చేసిన ఆయన, వైద్య పరికరాల కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. కోదాడ ఘటనపై స్పందిస్తూ.. పిల్లలను వద్దనుకునే వారు వారిని రోడ్డుపై వదలకుండా ఆసుపత్రిలోని ‘ఉయ్యాల’లో ఉంచాలని తల్లులకు సూచించారు.
Similar News
News February 19, 2026
సర్కార్‌కు షాక్.. GHMC 3 ముక్కలాటపై హైకోర్టు సీరియస్..!

HYDను 3ముక్కలు చేస్తూ సర్కార్ తెచ్చిన GOపై హైకోర్టులో వాదనలు మొదలయ్యాయి. 2027 జనగణన నేపథ్యంలో సరిహద్దుల మార్పుపై కేంద్రం ఫ్రీజ్ విధించినా రూల్స్‌కు విరుద్ధంగా GHMC విభజన నిర్ణయం తీసుకున్నారని గురువారెడ్డి పిల్ వేశారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ 3వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో విభజన ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నాయి.
News February 19, 2026
NGKL: చేపలు అమ్మడానికి సబ్సిడీపై వాహనాలు

NGKL జిల్లాలో చేపల విక్రయానికి గాను మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు ఇవ్వనున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి నరసింహారావు తెలిపారు. PM మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా 13 మోటార్ సైకిల్స్, అదేవిధంగా ఐస్ బాక్స్‌లు మంజూరు అయినట్లు తెలిపారు. ఒక్క యూనిట్ 75,000 ఉంటుందని, అందులో జనరల్ 7, మహిళలకు 2, ఎస్సీ 2, ఎస్టి 2, జనరల్ కు 40 శాతం, ఎస్సీ ఎస్టీలకు 60% సబ్సిడీ ఉంటుందని తెలిపారు. దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News February 19, 2026
విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్స

విజయనగరం సర్వజన ఆసుపత్రిలో క్యాన్సర్ రోగుల కోసం అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ తెలిపారు. క్యాన్సర్ వ్యాధి (Oncology) ఓపీ ప్రతి సోమవారం, గురువారం, ప్రివెంటివ్ క్యాన్సర్ (నివారణ) ఓపీ ప్రతి మంగళవారం, గురువారం ఉంటుందన్నారు. ముక్క పరీక్ష (Biopsy) ఆసుపత్రిలోని హిస్టోపాథాలజీ ల్యాబ్‌లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.


