News February 18, 2026
HYDలో కొత్త ట్రెండ్.. డిజిటల్ ‘Raw’నెస్

కలర్ ఫుల్ ఫిల్టర్ల కాలం చెల్లింది. ఇప్పుడు అంతా పక్కా లోకల్. గూగుల్ సెర్చ్‌కి టాటా చెప్పేసి GEN Z ఇన్‌స్టా రీల్స్‌లోనే బిర్యానీ అడ్రస్‌లు వెతుకుతున్నారు. ఎడిటింగ్ హడావిడి లేని అచ్చమైన ‘డిజిటల్ రానెస్’ వీడియోలకే ఇప్పుడు కిరాక్ రెస్పాన్స్. షో-ఆఫ్ కంటే కళ్ల ముందు కనిపించే నిజాయతీకే జనం ఫిదా అవుతున్నారు. గల్లీలో తీసిన అసలైన ఎమోషన్‌కే లైకులు, షేర్ల వర్షం కురుస్తోంది. ఈ కొత్త ట్రెండ్‌పై మీరేమంటారు?
Similar News
News February 19, 2026
చైనా రోబో డాగ్ వివాదం.. క్షమాపణలు చెప్పిన గల్గోటియాస్

చైనా <<19173893>>రోబో డాగ్<<>> తమ ఆవిష్కరణగా చెప్పుకుని విమర్శలపాలైన గల్గోటియాస్ యూనివర్సిటీ క్షమాపణలు తెలిపింది. ‘రోబో డాగ్ సాంకేతిక మూలాల గురించి మా ప్రతినిధికి తెలియదు. కెమెరా ఎదుట ఉత్సాహంతో తప్పుడు సమాచారాన్ని అందించారు. ఈ ఆవిష్కరణపై తప్పుదోవ పట్టించడం మా ఉద్దేశం కాదని అర్థం చేసుకోగలరు. నిర్వాహకుల మనోభావాలను అర్థం చేసుకుని మేం ఈ ప్రాంగణాన్ని ఖాళీ చేశాం’ అని ఓ ప్రకటనలో తెలిపింది.
News February 19, 2026
ఛత్రపతి: వీరత్వ పతాక.. ధీరత్వ ప్రతీక

శివాజీ చక్రవర్తి.. ఈ పేరు వింటే శత్రువులపై విరుచుకుపడిన వీరత్వం, రాజ్యాలను జయించిన ధీరత్వం గుర్తొస్తాయి. మొఘలులు, దక్కన్ సుల్తానుల మధ్య నలిగే ప్రజలకు విముక్తి కలగాలన్న తల్లి జిజియాబాయి మాటలతో రాజ్య స్థాపనపై బాల్యంలోనే కలగన్నారు. తల్లి నేర్పిన పురాణ గాథల బోధనల బుద్ధితో పాటు యుద్ధ విద్యలతో పరాయి పాలనలోని కోటలను బద్దలు కొట్టి మహారాష్ట్రలో మరాఠా జెండా ఎగురవేశారు. ఆ ఛత్రపతి జయంతి నేడు (19 feb 1630).
News February 19, 2026
హౌసింగ్ సమస్యలపై ‘ఫోన్-ఇన్’ కార్యక్రమం

కర్నూలు జిల్లాలో గృహ నిర్మాణ లబ్ధిదారుల సందేహాల నివృత్తి కోసం ప్రత్యేక ఫోన్-ఇన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు హౌసింగ్ పీడీ చిరంజీవి తెలిపారు. సిమెంట్, స్టీల్ సరఫరా, నిర్మాణ బిల్లులు మరియు PMAY 2.0 Urban ఇళ్లకు సంబంధించిన వివరాల కోసం ప్రతి గురువారం ఉదయం 10:00 నుంచి 11:00 గంటల వరకు సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
★ సంప్రదించాల్సిన నంబర్: 08518-257481


