News May 2, 2024

ప్రకాశం జిల్లాకు క్యూ కడుతున్న అధినేతలు

image

ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. వీరికి తోడుగా పార్టీ అధినేతలు జిల్లాకు క్యూ కట్టారు. ఏప్రిల్ 28, 30న జిల్లాలో పర్యటించిన సీఎం జగన్.. శుక్రవారం కనిగిరిలో ఏర్పాటు చేసిన భారీ భహిరంగ సభలో పాల్గొననున్నారు. అదే రోజు పొదిలిలో చంద్రబాబు నాయుడు, గిద్దలూరులో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఒకే రోజు జిల్లాలో పర్యటిస్తున్న తరుణంలో జిల్లాలో రాజకీయ వేడి పెరిగింది.

Similar News

News March 25, 2026

ప్రకాశం జిల్లా MLAలకు టెన్షన్.. టెన్షన్!

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన కొందరు MLAల్లో టెన్షన్ రేపుతోంది. ప్రస్తుతం SNపాడు, వై.పాలెం, కొండపి SC నియోజకవర్గాలు. పునర్విభజనలో జనరల్ స్థానాలను SC, STలతో పాటు మహిళలకు రిజర్వ్ చేస్తే కొత్త సీటు కోసం ఇప్పటి MLAలకు వెతుకులాట తప్పదు. వీటితో పాటు నియోజకవర్గాలు ముక్కలై, కొత్త మండలాలు కలిసే అవకాశం ఉంటుంది. ఆ మండలాలపై పట్టు సాధించాలంటే ప్రస్తుత MLAలకు ఓ కఠిన పరీక్షే.

News March 25, 2026

ప్రకాశం: ఇద్దరికి జైలుశిక్ష

image

ప్రకాశం జిల్లా టంగుటూరులో శ్రీనివాస థియేటర్ దగ్గర ఓ బైక్, వల్లూరు ఫేస్ ఇంజినీరింగ్ కాలేజీలో పార్కింగ్ చేసిన మరో బైక్ దొంగతనానికి గురైంది. 2025లో కేసు నమోద చేశారు. ఎస్ఐ నాగమల్లేశ్వరరావు దర్యాప్తు చేపట్టారు. నిందితులు నరసరావుపేట మండలం గురవాయపాలేనికి చెందిన బండారు నవీన్, తాళ్లూరి గాబ్రియల్‌గా గుర్తించారు. నేరం రుజువు కావడంతో వారికి రూ.10వేల జరిమానా, 5నెలలు జైలుశిక్ష పడింది.

News March 25, 2026

మార్కాపురం జిల్లా గ్యాస్ గోదాముల్లో పోలీసుల తనిఖీలు

image

మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జ్ SP హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లాలోని త్రిపురాంతకం, వెలిగండ్ల, కనిగిరి, టీవీపల్లి, రాచర్ల, సియస్‌పురం పోలీస్ స్టేషన్ల పరిధిలో గ్యాస్ గోదాములను మంగళవారం తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సంబంధిత రెవెన్యూ అధికారులు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్యాస్ గోదాముల్లో అమలు చేస్తున్న భద్రతా చర్యలు, అగ్నిమాపక సదుపాయాలు, తగినంత నీటి వసతిని పరిశీలించారు.