News May 2, 2024
బ్యాలెట్ పేపర్లు తయారయ్యేది ఇక్కడే

AP: సార్వత్రిక ఎన్నికలకు అవసరమైన పత్రాలు, బ్యాలెట్ పేపర్లను కర్నూలులోని ఆంధ్ర గవర్నమెంట్ ప్రెస్‌లో తయారు చేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగినప్పుడూ ఇక్కడే బ్యాలెట్ పత్రాలు ముద్రించేవారు. ప్రస్తుతం నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తైనందున అన్ని జిల్లాల నుంచి ఫైనల్ అయిన అభ్యర్థుల పేర్లు, గుర్తుల జాబితా ఇక్కడికి చేరుతుంది. దాని ప్రకారం ప్రింటింగ్ ప్రక్రియ పూర్తి చేసి పంపిణీ చేస్తారు.
Similar News
News March 17, 2026
IPL స్కోర్‌కార్డ్స్.. ఏది నచ్చింది?

ఐపీఎల్ అంటే ఆట మాత్రమే కాదు.. స్క్రీన్‌పై కనిపించే స్కోర్‌కార్డ్ గ్రాఫిక్స్ కూడా స్పెషలే. 2008 నుంచి 2025 వరకు వీటి డిజైన్లు మారుతూ వచ్చాయి. 2014-15 నాటి గ్లాసీ లుక్, 2016 నాటి ఫ్యూచరిస్టిక్ డిజైన్లు ‘బెస్ట్’ అని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే 2011-12 నాటి పాత డిజైన్లు, 2023-24లో వాడిన ఇటాలిక్ ఫాంట్లు అంతగా ఆకట్టుకోలేదంటున్నారు. పాత డిజైన్లకే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. ఇంతకీ మీ ఫేవరెట్ ఏది? COMMENT
News March 17, 2026
రేపటి నుంచే దివ్యాంగులకు ఉచిత ప్రయాణం!

AP: RTC బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. 40 శాతం, ఆపైన వైకల్యం ఉన్న దివ్యాంగులు సిటీ ఆర్డినరీ, మెట్రో, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఫ్రీగా వెళ్లొచ్చు. బస్సు ఎక్కేటప్పుడు PHC పాస్/వికలాంగుల కార్డు చూపించి జీరో టికెట్ తీసుకోవాలని RTC సూచించింది.
News March 17, 2026
KKRకు గాయాల ‘దెబ్బ’

IPL ప్రారంభానికి ముందు KKRను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే ఇంజూరీతో హర్షిత్ రాణా <<19394540>>నడవలేని <<>>స్థితిలో ఉన్నారు. T20 WC సందర్భంగా గాయపడ్డ శ్రీలంక పేసర్ పతిరణ ఆడటం కూడా అనుమానంగా మారింది. KKR అతడిని రూ.18Crకు కొనుగోలు చేసింది. అయితే ఏదో ఒక దశలో పతిరణ అందుబాటులోకి వస్తాడని భావిస్తోంది. పతిరణ, రాణాకు రీప్లేస్‌మెంట్ తీసుకోవద్దని నిర్ణయించింది. ముస్తాఫిజుర్ ప్లేస్‌లో <<19375126>>ముజరబానిని<<>> తీసుకుంది.


