News February 19, 2026

HYD: ‘సెటిల్’ అంటే పెళ్లి కాదు

image

‘ముందు నా లైఫ్.. ఆ తర్వాతే ఎవరైనా’ నేటి యువత మంత్రం ఇదే. పాతతరంలా పెళ్లి, పిల్లలే జీవిత పరమార్థం అని వీరు అనుకోవడం లేదు. ట్రావెలింగ్, ప్యాషన్ ప్రాజెక్ట్స్, మెంటల్ హెల్త్‌కే ఫస్ట్ ప్రయారిటీ. పెళ్లైనా.. తమకంటూ కొంత పర్సనల్ స్పేస్ కావాలని కోరుకుంటున్నారు. ఇంట్లో ఆ స్వేచ్ఛ దొరకనప్పుడు జిమ్ములు, కేఫ్‌లు, ఆఫీసుల్లోనే ఎక్కువ సమయం గడుపుతూ తమను తాము వెతుక్కునే పనిలో పడ్డారు.

Similar News

News February 22, 2026

​నిర్మల్: ‘అరైవ్ అలైవ్’ వారోత్సవాల షెడ్యూల్!

image

‘అరైవ్ అలైవ్’ 7 రోజుల షెడ్యూల్‌ ఇదే.
1వ రోజు రోడ్డు భద్రతపై అవగాహన, ప్రచారం
2వ రోజు లేన్ డిసిప్లిన్, తప్పుడు ఓవర్‌ టేకింగ్‌పై తనిఖీలు
3వ రోజు హెల్మెట్ వాడకంపై స్పెషల్ డ్రైవ్
4వ రోజు సీట్‌బెల్ట్ నిబంధనల అమలు
5వ రోజు మద్యం సేవించి వాహనం నడిపేవారిపై నిఘా, బ్రెత్ అనలైజర్ పరీక్షలు
6వ రోజు భారీ వాహన డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు, కళ్లజోళ్ల పంపిణీ
7వ రోజు డిఫెన్సివ్ డ్రైవింగ్‌పై అవగాహన.

News February 22, 2026

ఇవాళ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

image

శుభకార్యాల సీజన్‌కు తోడు ఇవాళ ఆదివారం సెలవు కావడంతో చాలామంది బంగారం, వెండి కొనుగోళ్లకు వెళ్తుంటారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రేట్ రూ.1,59,280గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ.1,46,000 పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్ రేట్ రూ.2,90,000గా కొనసాగుతోంది. ఇటీవల భారీగా పెరిగిన ఈ రెండు మెటల్ రేట్స్ కాస్త తగ్గి కొనుగోలుదారులకు స్వల్ప ఊరటనిచ్చాయి.

News February 22, 2026

నిర్మల్: రేపటి నుంచి యథావిధిగా ప్రజావాణి

image

కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈనెల 23వ తేదీ (సోమవారం) నుంచి తిరిగి ప్రారంభమవుతుందని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసిన నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతులు, ఫిర్యాదులు సమర్పించాల్సిన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు.