News May 2, 2024

MHBD:కేసీఆర్ యాత్రలో హైలైట్స్ ఇవే..

image

బతుకమ్మలు, కోలాటాలతో కేసీఆర్‌కు శ్రేణులు స్వాగతం పలికాయి. సభలో కేసీఆర్ 14 నిమిషాలు ప్రసంగించారు. మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ తాను స్వయంగా తయారుచేసిన అరిసెలు, గారెలు కేసీఆర్‌కు అందజేశారు. సభ ముగిశాక ఎంపీ కవిత, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, మాజీ ఎమ్మెల్యే హరిప్రియం బస్సుపై డ్యాన్స్ వేశారు. ఎంపీ కవిత నివాసానికి మొదటిసారి వచ్చిన కేసీఆర్‌కు కవిత మిత్రురాలు హారతి ఇచ్చి స్వాగతం పలికారు.

Similar News

News April 2, 2026

వరంగల్: ప్రాణదాతలు.. ఈఎంటీలు!

image

అత్యవసర స్థితిలో ఉన్న బాధితులకు ప్రాథమిక చికిత్స అందిస్తూ, ఆసుపత్రులకు చేర్చి ప్రాణాలు నిలబెడుతున్న 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల సేవలు అమోఘం. ఉమ్మడి వరంగల్‌లో 109 మంది ఈఎంటీలు గడిచిన ఏడాదిలో 1,17,054 మందిని కాపాడారు. జనవరిలో జరిగిన రోడ్డు ప్రమాద బాధితులను సమయస్ఫూర్తితో MGMకు తరలించిన కర్ణాకర్ వంటి వారు ఎందరో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నేడు ‘జాతీయ ఈఎంటీ దినోత్సవం’.

News April 2, 2026

వరంగల్: అంగన్‌వాడీ పోస్టులు ఎప్పుడు..?

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టులు భర్తీ కాకపోవడంతో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 919 కేంద్రాలు ఉండగా.. 66 టీచర్, 284 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వరంగల్, వర్ధన్నపేట, నర్సంపేట ప్రాజెక్టుల పరిధిలో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. సిబ్బంది కొరతతో ఉన్న టీచర్లకే అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో పౌష్ఠికాహారం, సర్వేలు సక్రమంగా జరగడం లేదు.

News April 2, 2026

గ్రామ సభలను విజయవంతం చేయాలి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు గ్రామ సభలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సభల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, పథకాలపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు.