News May 2, 2024
APలో మా మద్దతు జగన్‌కే: అసదుద్దీన్

TG: ఏపీలో తమ మద్దతు సీఎం వైఎస్ జగన్‌కేనని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ‘ఆంధ్రలో టీడీపీ-జనసేన కూటమిలో నటులు ఉంటే.. దేశంలోనే మహానటుడు మోదీ. మోదీని ప్రశ్నించే దమ్ము చంద్రబాబుకు లేదు. ప్రధానిని ఢీకొట్టే సత్తా జగన్‌కే ఉంది. చంద్రబాబు గెలిస్తే మోదీ చేతిలో కీలుబొమ్మగా మారతారు. జగన్ సీఎంగా ఉంటే ఏపీలో మైనారిటీ హక్కులను పరిరక్షిస్తారు. అందుకే ఏపీలోని ప్రజలు జగన్‌కే ఓటేయాలి’ అని ఆయన విజ్ఞప్తి చేశారు.
Similar News
News March 16, 2026
ప్రేయసికి భర్తను ‘లీజు’కు ఇస్తానన్న భార్య.. కానీ!

మోసం చేసిన భర్తకు విడాకులు ఇవ్వకుండా అతనిని ప్రేయసికే అద్దెకు ఇవ్వడానికి సిద్ధమైందో భార్య. దీనిద్వారా ఖున్ క్వాంగ్ నెలకు ₹85వేలు డిమాండ్ చేసింది. ఈ ఘటన థాయిలాండ్‌లో జరిగింది. వీరికి వివాహమై 10 ఏళ్లయింది. గతేడాది ఓ మహిళతో భర్త అక్రమ సంబంధాన్ని భార్య గుర్తించింది. దీనిపై ప్రశ్నించగా ఇరువురూ విడిచి ఉండలేమన్నారు. దీంతో ఆమె అద్దె ప్రతిపాదన పెట్టగా ప్రేయసి ఒప్పుకుంది. కానీ భర్త అంగీకరించలేదు.
News March 16, 2026
సర్ఫరాజ్ అహ్మద్ రిటైర్మెంట్

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇతను కెరీర్‌లో 54 టెస్టులు, 117 వన్డేలు, 61 టీ20లు ఆడారు. 6 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 6,164 రన్స్ చేశారు. వికెట్ కీపర్‌గా 315 క్యాచ్‌లు పట్టారు. కెప్టెన్‌గా 2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అందించారు. U-19 సారథిగా 2006లో వరల్డ్ కప్ సాధించారు.
News March 16, 2026
‘మౌంటెడ్ స్ప్రేయర్’తో ఎరువుల పిచికారీ సులభం

అందుబాటులోకి వస్తున్న ఆధునిక పరికరాలు సాగులో రైతు శ్రమను తగ్గిస్తున్నాయి. ప్రస్తుతం చాలా మంది రైతులు ‘మౌంటెడ్ స్ప్రేయర్’ అనే పరికరాన్ని వాడుతున్నారు. దీన్ని ట్రాక్టరుకు బిగించి ద్రవరూపంలో ఎరువులను పిచికారీ చేస్తున్నారు. దీంతో తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో రోజుకు 20 ఎకరాల వరకు స్ప్రే చేయవచ్చు. దీన్ని వాడటం వల్ల కూలీల కొరతను అధిగమించడంతో పాటు మొక్కలకు కూడా సమపాళ్లలో ఎరువులు, మందులను అందించవచ్చు.


