News May 2, 2024
కొవిషీల్డ్ సురక్షితమే.. ఆందోళన వద్దు: ఆస్ట్రాజెనెకా

కొవిషీల్డ్ వ్యాక్సిన్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనెకా పేర్కొంది. కాగా.. ఈ వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఇటీవల ఆస్ట్రాజెనెకా అంగీకరించడంతో టీకా తీసుకున్న వారిలో ఆందోళన మొదలైంది. తాజాగా ఈ విషయంపై ఆస్ట్రాజెనెకా మళ్లీ స్పందించింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రయోగ పరీక్షల్లో కొవిషీల్డ్ మంచి ఫలితాలు ఇచ్చిందని పేర్కొంది.
Similar News
News March 23, 2026
ఇళ్ల కోసం 10 లక్షల దరఖాస్తులు: పార్థసారథి

AP: రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల కోసం 10 లక్షల దరఖాస్తులు వచ్చాయని మంత్రి పార్థసారథి తెలిపారు. అందులో 6.5 లక్షల మందికి అర్హత ఉందని గుర్తించామని చెప్పారు. ఇంటి నిర్మాణ వ్యయం పట్టణాల్లో రూ.2.5 లక్షలు, గ్రామాల్లో రూ.2.39 లక్షలుగా నిర్ణయించినట్లు వెల్లడించారు. మరోవైపు అకాల వర్షాలకు దాదాపు 15 వేల మంది రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. ఈ నెల 31 లోపు పంట నష్టం వివరాలను అందించాలని ఆదేశించినట్లు వివరించారు.
News March 23, 2026
‘రావణ కాష్ఠం’ అంటే ఏమిటి?

ఎప్పటికీ పరిష్కారం కాకుండా ఉండే సమస్యలను ప్రస్తావించేటప్పుడు ‘రావణ కాష్ఠం’ జాతీయాన్ని ఉపయోగిస్తాం. కాష్ఠం అంటే కర్ర/చెక్క. రావణుడు దుష్టుడు అయినప్పటికీ గొప్ప దైవ భక్తుడు. ఎన్నో యజ్ఞాలు, యాగాలు చేసేవాడు. అందులో ఓసారి వాడిన వస్తువులను మరోసారి వాడకూడదు. అలా దాచిన వస్తువులన్నింటినీ రావణుడి చితిపై వేసి విభీషణుడు తగలబెట్టారు. దీంతో ఆ చితి కొన్నేళ్లపాటు ఆరిపోకుండా మండుతూనే ఉందట.
<<-se>>#EPICSAYINGS<<>>
News March 23, 2026
PSL: విదేశీ ఆటగాళ్లకు పాక్ మిలిటెంట్ల హెచ్చరికలు!

పాక్ సూపర్ లీగ్(PSL)కు <<19452212>>వరుస షాక్‌లు<<>> తగులుతున్నాయి. విదేశీ ప్లేయర్లు టోర్నీ నుంచి వైదొలగాలని తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్(TTP) అనుబంధ జమాత్ ఉల్ అహ్రార్ హెచ్చరించింది. ‘ప్లేయర్లను పంపొద్దని సంబంధిత బోర్డులను కోరుతున్నాం. వారికి ఏదైనా జరిగితే మాది బాధ్యత కాదు. ఇప్పటికే హెచ్చరించాం. మ్యాచులు జరగకుండా చేయాల్సినదంతా చేస్తాం. క్రీడలు నిర్వహించే స్థితిలో పాకిస్థాన్ లేదు’ అని అడ్వైజరీ జారీ చేసింది.


