News May 2, 2024

SRH-RR హెడ్ టూ హెడ్ ఇలా..

image

ఇవాళ ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్, రాజస్థాన్ మధ్య మరో రసవత్తర పోరు జరగనుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 18 మ్యాచులు జరగ్గా.. చెరో తొమ్మిది మ్యాచుల్లో విజయం సాధించాయి. టేబుల్ టాపర్‌గా ఉన్న RR జట్టు టాపార్డర్ భీకరమైన ఫామ్‌లో ఉంది. మరోవైపు SRH టాపార్డర్ నిలదొక్కుకుంటే హోంటీమ్‌కు అడ్డే ఉండదు. ఈ క్రమంలో టాపార్డర్ తిరిగి ఫామ్‌లోకి వచ్చి సన్‌రైజర్స్ గెలుపు బాట పట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Similar News

News December 25, 2024

కపిల్ దేవ్‌ను తప్పుబట్టిన అశ్విన్

image

తన చేతిలో విషయమైతే అశ్విన్‌ను అలా సాదాసీదాగా రిటైర్ కానిచ్చేవాడిని కానని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యల్ని అశ్విన్ తప్పుబట్టారు. ఫేర్‌వెల్ మ్యాచులనేవి తనకు నచ్చవని స్పష్టం చేశారు. అవి సెలబ్రిటీ సంస్కృతిలో భాగమన్నారు. ‘నాకోసం ఎవరైనా ఒక చుక్క కన్నీరు కార్చినా నాకిష్టం ఉండదు. ఒకరి ఘనతల్ని చూసి స్ఫూర్తి పొందొచ్చు. అంతే తప్ప ఆ ఘనతల వెనక పడకూడదు’ అని పేర్కొన్నారు.

News December 25, 2024

అమిత్ షా, నిర్మలతో చంద్రబాబు భేటీ

image

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీగా గడిపారు. ఇవాళ సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ అయిన ఆయన కాసేపటి క్రితం కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనులపై చర్చించారు. ఇవాళ్టితో బాబు హస్తిన టూర్‌ ముగిసింది. రేపు ఆయన నేరుగా హైదరాబాద్ చేరుకోనున్నారు. అక్కడ జరిగే మంత్రి టీజీ భరత్ కూతురు వివాహానికి హాజరవుతారు.

News December 25, 2024

రామ్‍చరణ్ దంపతుల క్రిస్మస్ వేడుకలు

image

సెలబ్రిటీలు క్రిస్మస్‌ను కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకోవడం తెలిసిందే. నటుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులు మాత్రం తమ సిబ్బందితో పండుగ వేడుకలు చేసుకున్నారు. వీరిలో వారి ఇంటి సిబ్బందితో పాటు అపోలో సిబ్బంది కూడా ఉండటం గమనార్హం. తమ వద్ద పనిచేసేవారికీ పండుగను సెలబ్రేట్ చేయడం గ్రేట్ అంటూ మెగా ఫ్యాన్స్ వారిని కొనియాడుతున్నారు.