News May 2, 2024

నేతలకు గుర్తుల గుబులు

image

2019 BHNR లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 5 వేల ఓట్ల మెజార్టీతో గెలవగా..ఇక్కడ కారును పోలిన రోడ్డు రోలర్‌ గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థికి ఏకంగా 25 వేల ఓట్లు వచ్చాయి. అప్పట్లో బీఆర్ఎస్ నేతలు సీఈసీకి ఫిర్యాదు చేయడంతో దాన్ని తొలగించారు. ప్రస్తుతం చపాతి రోలర్‌, రోడ్డు రోలర్‌ గుర్తులను కేటాయించారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుర్తుల గుబులు పట్టుకుంది.

Similar News

News March 17, 2026

NLG: మొదటి విడత కంప్లీట్… రెండో విడతకు కసరత్తు

image

జిల్లాలో వ్యవసాయాన్ని మరింత ఆధునీకరించేందుకు ప్రభుత్వం రెండో విడత యాంత్రీకరణ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాగులో యంత్రాల వాడకాన్ని పెంచి, రైతులకు శ్రమ, పెట్టుబడి భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం మరో రూ.4 కోట్ల భారీ నిధులు కేటాయించనున్నది. జిల్లాలో ఇప్పటికే మొదటి విడతలో రూ.4 కోట్ల వ్యయంతో 1,900 మంది రైతులకు ప్రభుత్వం విజయవంతంగా పరికరాలను అందజేసింది.

News March 17, 2026

నల్గొండ: ఊరి శివారులో యువకుడి మృతదేహం

image

శాలిగౌరారం మండలం కొండారం శివారులో రోడ్డు పక్కన ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఉదయం బావుల వద్దకు వెళ్లిన రైతులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు, ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News March 17, 2026

సాగర్ ఎడమ కాల్వలో మిర్యాలగూడ యువకుడి గల్లంతు

image

మిర్యాలగూడ ఇందిరమ్మ కాలనీకి చెందిన నాగెల్లి తరుణ్ (22) బొక్కమంతులపాడు శివారులో సాగర్ ఎడమ కాల్వలో గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులతో కలిసి బట్టలు ఉతకడానికి వచ్చిన అతడు సోమవారం సాయంత్రం ఈత కొడుతుండగా నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో కొట్టుకుపోయినట్లు తెలిపారు. స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అన్న మణిబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.