News May 2, 2024
ఆంధ్ర క్రికెట్ సంఘం శిబిరాలకు జిల్లా శిక్షకులు ఎంపిక

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మహిళలకు నిర్వహించనున్న క్రికెట్ శిక్షణ శిబిరాలకు జిల్లాకు చెందిన పలువురిని శిక్షకులుగా ఎంపిక చేశారు. జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి మధుసూదన్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాకు చెందిన బొమ్మన్న సీనియర్ మహిళా జట్టుకు నైపుణ్య శిబిరానికి టైనర్‌గా నియమించారు. శర్మాస్‌వలిని జూనియర్ మహిళా జట్టుకు మొదటి బ్యాచ్ శిక్షకుడిగా, రెండో బ్యాచ్ శిక్షకుడిగా K.నరేశ్‌ను నియమించారు.
Similar News
News March 11, 2026
పరీక్షలకు 269 మంది విద్యార్థుల గైర్హాజరు

అనంతపురం జిల్లాలో నేడు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కామర్స్ పరీక్షలు జరిగాయి. నేటి పరీక్షలకు సెట్-III ప్రశ్న పత్రాన్ని వాడామని RIO వెంకటరమణ నాయక్ తెలిపారు. జనరల్ విద్యార్థులు 4,069 గాను 3,937 మంది హాజరు కాగా 132 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 1,468 గాను 1,331 మంది హాజరు కాగా 137 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షలను CC కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించామన్నారు.
News March 11, 2026
అనంత: ఫలితాలు విడుదల

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన M.Tech 1-1 (R25) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్‌తో కలిసి ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి మంగళవారం విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు కళాశాలలోని అకడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.
News March 11, 2026
అనంత: ఫలితాలు విడుదల

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన M.Tech 1-1 (R25) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్‌తో కలిసి ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి మంగళవారం విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు కళాశాలలోని అకాడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.


