News May 2, 2024
APPLY NOW.. 3712 ప్రభుత్వ ఉద్యోగాలు

దేశంలోని ప్రభుత్వ శాఖల్లో 3,712 CHSL(10+2) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. మే 7 రాత్రి 11 వరకు అప్లై చేయవచ్చు. మే 10, 11 తేదీల్లో దరఖాస్తులు సవరించుకోవచ్చు. లోయర్ డివిజన్ క్లర్క్/జూ.సెక్రటేరియల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. 18-27 ఏళ్లలోపు ఉన్న వారు అర్హులు కాగా.. రిజర్వేషన్‌ను బట్టి వయో పరిమితి వర్తిస్తుంది. ఫీజు రూ.100. టైర్-1 పరీక్షలు జూన్-జూలైలో జరుగుతాయి.
Similar News
News March 4, 2026
శ్రీవారి పేరు ఉచ్చరించే నైతికత నీకుందా జగన్: బీఆర్ నాయుడు

AP: హిందుత్వం గురించి మాట్లాడే అర్హత <<19295165>>జగన్‌కు<<>> లేదని టీటీడీ ఛైర్మన్ BR నాయుడు విమర్శించారు. శ్రీవారి పేరు ఉచ్చరించే నైతికత ఆయనకు లేదని ఫైరయ్యారు. ‘హిందూ వ్యతిరేకి అయిన నువ్వు CMగా ఉన్నావనే వైవీ, భూమన హిందూ మత ఔన్నత్యాన్ని మంటగలిపారు. నేను ఛైర్మన్ అయ్యాక TTDని ప్రక్షాళన చేస్తున్నా. అందుకే నాపై ఫేక్ వీడియోలతో తిరుమల ప్రతిష్ఠ దెబ్బతీయాలని చూశావు’ అని మండిపడ్డారు.
News March 4, 2026
భయం పుట్టించే B-2 తయారీలో ఇండో-అమెరికన్!

ప్రపంచంలో భయంకరమైన యుద్ధ ఆయుధాల్లో <<19277612>>B-2<<>> బాంబర్ టాప్‌లో ఉంటుంది. దీని తయారీలో భారత సంతతికి చెందిన నోషిర్ గొవాడియాది కీలకపాత్ర. 1944లో బాంబేలో జన్మించిన ఈయన USకు వెళ్లి ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివారు. నార్త్‌రోప్ గ్రుమ్మన్ కంపెనీలో డిజైన్ ఇంజినీర్‌గా చేరారు. B-2 బాంబర్లు శత్రువుల రాడార్లకు కనబడకుండా స్పెషల్ డిజైన్ చేశారు. చైనాకు దీని సమాచారం ఇచ్చారని US కోర్టు 2010లో 32 ఏళ్ల జైలుశిక్ష విధించింది.
News March 4, 2026
రాజ్యసభ రేసు: రాష్ట్ర కాంగ్రెస్‌లో ఉత్కంఠ

TG: రాష్ట్ర నుంచి రాజ్యసభ సభ్యుల ఎంపిక ప్రక్రియ కాంగ్రెస్‌లో ఉత్కంఠగా మారింది. 1 స్థానం సింఘ్వీకి ఖరారైనట్లే. రెండో ప్లేస్‌కు వేం నరేందర్ రెడ్డి కోసం CM రేవంత్ పట్టుబడుతుండగా, తనకు అవకాశమివ్వాలని ప్రియాంక గాంధీ ద్వారా AICC కార్యదర్శి వంశీచంద్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా రమణ నాయక్ పేరు తెరపైకి వచ్చింది. రమణ నాయక్ CMకు సన్నిహితుడే. TDP అధినేత CBNతోనూ ఆయనకు మంచి సంబంధాలున్నాయి.


