News May 2, 2024
శ్రీకాకుళం: నేటి నుంచి వేట నిషేధ భృతి లబ్ధిదారుల ఎన్యూమరేషన్

జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో వేట నిషేధకాలానికి భృతి అందించేందుకు అర్హుల గుర్తింపు కోసం గురువారం నుంచి ఎన్యుమరేషన్ ప్రక్రియను చేపట్టనున్నామని జిల్లా మత్స్యశాఖాధికారి పీవీ శ్రీనివాసరావు తెలియజేశారు. ఈసీ అనుమతితో ఈ సర్వేలో అధికారులే స్వయంగా మండలాల్లో అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార భరోసా కింద రూ.10 వేల నగదును ఆర్థిక సాయంగా అందజేస్తుందని ప్రకటించారు.
Similar News
News April 25, 2025
శ్రీకాకుళం: ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష అదనపు పథక సమన్వయకర్త శశిభూషణ్ గురువారం తెలిపారు. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల విద్యార్థుల సమీప స్కూళ్లలో 25 శాతం సీట్లు కేటాయిస్తామని తెలిపారు. ఈ నెల 28 నుంచి మే 15 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు 9703585990 నంబరుని సంప్రదించాలని పేర్కొన్నారు.
News April 25, 2025
బుడగట్లపాలెం : సీఎం చేతుల మీదుగా రూ. 250 కోట్ల పంపిణీ

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మత్స్యకార భరోసా పథకం కింద 250 కోట్ల రూపాయలు పంపిణీకి సిద్ధం చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. బుడగట్లపాలెంలో గురువారం ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 26న నిధులు పంపిణీకి ముఖ్యమంత్రి రానున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ కె.వి. మహేశ్వర్ రెడ్డి, అధికారులు ఉన్నారు.
News April 25, 2025
సీఎం చంద్రబాబు పర్యటన .. షెడ్యూల్

రేపు (శనివారం) CM చంద్రబాబు ఎచ్చెర్లకు రానున్న విషయం తెలిసిందే. ఆయన పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది.☛ 10:00AM విజయవాడ ఏయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్లో రాక☛11:55AM బుడగట్లపాలెం హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ ☛12:10 PM బుడగట్లపాలెంలో అమ్మవారిని దర్శించుకుంటారు.☛ 1:20 నుంచి బుడగట్లపాలెం ప్రజలతో సమావేశం.☛ 3:25PM – 4:55PM పథకం ప్రారంభ కార్యక్రమం.☛5:00PM తిరిగి బుడగట్లపాలెం హెలిప్యాడ్ నుంచి విశాఖ ప్రయాణం.