News February 19, 2026
HYD: నెల రోజులు రెక్కీ చేసి.. దారుణ హత్య

వనస్థలిపురం PS పరిధిలో వివాహిత హత్య జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మహేశ్ తెలిపారు. BNరెడ్డి కప్పలచెరువు వద్ద గ్రీన్ సిటీ కాలనీలో ఉండే సునీత(30)కు 2022లో నిందితుడు మహేశ్(30)తో వివాహమైంది. గొడవల వల్ల 2024లో విడాకులు తీసుకుని 2025 ఏప్రిల్‌లో శ్రీనాథ్‌ను రెండో వివాహం చేసుకుందన్న కోపంతో నెల నుంచి రెక్కి నిర్వహించి బుధవారం పథకం ప్రకారం చంపేశాడని సీఐ తెలిపారు.
Similar News
News April 15, 2026
KNR: ఆర్టీసీలో వేధింపులు.. ఏం జరిగిందో తెలుసా?

KNR -2 డిపో పరిధిలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి మహిళా కండక్టర్లను వేధిస్తున్నాడంటూ HYDలోని ఉన్నతాధికారులకు లేఖరాశారు. వెంటనే స్పందించిన RTC యాజమాన్యం విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ అధికారులు లేఖలో ఉన్న మహిళా కండక్టర్లను, సంబంధిత ఉద్యోగిని విచారించగా అలాంటిదేమీ లేదని తేలడంతో అధికారులు అవాక్కయ్యారు. ఫేక్ లెటర్ అని నిర్ధారణకు వచ్చారు. పేరులేకుండా లేఖరాసిన ఆ వ్యక్తి ఎవరో గుర్తించేపనిలో అధికారులు పడ్డారు.
News April 15, 2026
తెలంగాణ స్క్వాష్ జట్టు కోచ్‌గా నిజామాబాద్ వాసి

నిజామాబాదు జిల్లా డిచ్‌పల్లి మండలం యానంపల్లి గ్రామానికి చెందిన బీ.దీపక్ కుమార్ ఈ నెల ఏప్రిల్ 16 – 22 వరకు న్యూ ఢిల్లీలో జరిగే 69వ జాతీయ స్థాయి స్క్వాష్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారని పీడీ రాము తెలిపారు. జిల్లా యువకుడు ఈ ఎంపిక పట్ల యానంపల్లి గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
News April 15, 2026
AP, TGలో ఎన్ని లోక్‌సభ స్థానాలు పెరుగుతాయ్?

లోక్‌సభ స్థానాల పునర్విభజనతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ముఖచిత్రం మారనుంది. మొత్తం సీట్లు 850కి (54.54%) పెరిగితే.. ప్రస్తుతం ఉన్న స్థానాలకు అదనంగా ఏపీలో 14, తెలంగాణలో 9 సీట్లు కలవనున్నాయి. అంటే ఏపీలో మొత్తం ఎంపీ సీట్లు 39కి, తెలంగాణలో 26కి చేరతాయి. ఒకవేళ పెంపు 50%కే పరిమితమైతే APలో 13 సీట్లు మాత్రమే పెరుగుతాయి. దక్షిణాదిలో 50% అయితే 65 సీట్లు, 54.54% అయితే 71 స్థానాలు పెరుగుతాయి.


