News February 19, 2026

ఇవాళ జగన్ ప్రెస్‌మీట్

image

AP: వైసీపీ అధినేత జగన్ ఇవాళ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు మీడియాతో మాట్లాడనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తిరుమల కల్తీ నెయ్యి అంశం, హెరిటేజ్ ఇష్యూ, మండలిలో చర్చకు వచ్చిన పలు అంశాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది.

Similar News

News March 9, 2026

లెబనాన్‌పై ఇజ్రాయెల్ సీక్రెట్ కెమికల్ వెపన్?

image

లెబనాన్‌పై ఇజ్రాయెల్ ‘వైట్ ఫాస్పరస్’ ప్రయోగించిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ ఆరోపించింది. మార్చి 3న యోహ్మోర్ పట్టణంలోని నివాస ప్రాంతాలపై సీక్రెట్‌గా ఈ కెమికల్ వెపన్స్‌ను వాడినట్లు వెల్లడించింది. గాలిలోని ఆక్సిజన్‌తో కలిసినప్పుడు మండే గుణం ఉన్న ఈ పదార్థంతో ఇళ్లు, కార్లు తగలబడ్డాయని, ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే అని పేర్కొంది. దీనివల్ల పౌరులకు ప్రాణాపాయం లేదా తీవ్రమైన గాయాలు అయ్యే ఛాన్స్ ఉంటుంది.

News March 9, 2026

ఇతిహాసాల నుంచి నానుడిలు: ‘ముసలం పుట్టడం’ అంటే ఏమిటి?

image

ఒక సమాజం, కుటుంబం, లేదా పార్టీ అంతర్గత కలహాలతో నాశనమైపోతుంది అని చెప్పడానికి ‘ముసలం పుట్టింది’ అనే నానుడిని వాడతారు. ఇది మహాభారతంలోని ‘మౌసల పర్వం’ నుంచి వచ్చింది. యాదవులు అపహాస్యం చేయడంతో వారి వంశ నాశనానికి ముసలం(ఇనుప రోకలి) పుడుతుందని మునులు శపిస్తారు. అన్నట్లుగానే యాదవ వంశం పతనమై ద్వారక సముద్రంలో కలిసిందని నమ్మకం.
<<-se>>#EPICSAYINGS<<>>

News March 9, 2026

ఇండియాకు డిస్కౌంట్ ఆపేసిన రష్యా: రిపోర్ట్స్

image

మిడిల్ ఈస్ట్‌ యుద్ధంతో రష్యా లాభపడుతోంది. ఇరాన్ యుద్ధానికి ముందు ఇండియా రిఫైనరీలకు (FEB 28) బ్యారెల్‌పై 13 డాలర్లు డిస్కౌంట్ ఇచ్చిన రష్యా ఇప్పుడు దాన్ని ఆపేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు బ్రెంట్ బ్యారెల్ ధరపై అదనంగా $4 నుంచి $5 ప్రీమియం వసూలు చేస్తున్నట్లు సమాచారం. కాగా హార్ముజ్ జలసంధి మూసివేత, చమురు ఎగుమతులు నిలిచిపోవడంతో మిడిల్ ఈస్ట్ దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. దీంతో రష్యా కీలకంగా మారింది.