News February 19, 2026

నల్గొండ: పంట సర్వేకు వాలంటీర్ల నియామకం

image

నల్గొండ జిల్లాలో యాసంగి పంటల నమోదుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ డిజిటల్ సర్వే కోసం గ్రామానికి ఒక వాలంటీర్‌ను నియమించనున్నారు. అగ్రికల్చర్ డిగ్రీ, డిప్లొమా చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి సర్వే నమోదుకు రూ.7 చొప్పున చెల్లిస్తారు. 2 రోజుల్లో లోపు నియామకాలు పూర్తి చేసి, నెల చివరిలోగా సర్వే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాలో 5.66 లక్షల ఎకరాల పంట వివరాలు సేకరించనున్నారు.

Similar News

News April 19, 2026

నల్గొండ: చేతికి అందని ‘స్మార్ట్’ సేవలు

image

అంగన్వాడీ కేంద్రాల్లో డిజిటల్ సేవలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్‌ఫోన్లు లబ్ధిదారులకు అందకుండా కార్యాలయాలకే పరిమితమయ్యాయి. జిల్లాలోని 2,093 కేంద్రాల్లో బాలింతలు, చిన్నారుల పౌష్టికాహార వివరాలను ఆన్‌లైన్ చేయాల్సి ఉన్నా.. ఫోన్ల పంపిణీలో జాప్యం జరుగుతోంది. ఇప్పటివరకు మండలానికి ఒకరిద్దరికి మాత్రమే మొబైల్స్ అందించి, మిగిలినవి అటకెక్కిండంపై అంగన్వాడీ కార్యకర్తలు మండిపడుతున్నారు.

News April 19, 2026

NLG: 6 నియోజకవర్గాలు.. 6 పబ్లిక్ స్కూల్స్

image

జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో తలా ఒకటి చొప్పున తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మంజూరైనట్లు కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. నల్గొండ (దోమలపల్లి), మునుగోడు (చండూరు), నాగార్జునసాగర్ (పెద్దవూర)తో పాటు నకిరేకల్, మిర్యాలగూడ, దేవరకొండ పాఠశాలలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. కార్పొరేట్ స్థాయిలో తరగతి గదులు, ప్రయోగశాలలు, క్రీడా మైదానాలను అభివృద్ధి చేయనున్నారరు.

News April 19, 2026

నల్గొండ: రైలు కింద పడి మహిళ ఆత్మహత్య

image

రైలు కింద పడి ఓ గుర్తుతెలియని మహిళ(55) ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం రాత్రి చిట్యాల – శ్రీరాంపురం మధ్య గోపలాయపల్లి వద్ద చోటుచేసుకుంది. సికింద్రాబాద్ – హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ కింద పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్టేషన్ మాస్టర్ అభినవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లగొండ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలి ఆచూకీ తెలిసిన వారు 87126 58595 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్‌ఐ కోరారు.