News February 19, 2026

ఇంటర్వ్యూతో IICTలో ఉద్యోగాలు

image

<>HYD<<>>లోని CSIR-IICT 16పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు FEB 24న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి PhD, MTech, మెటీరియల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, MSc(కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, మైక్రో బయాలజీ, ఫుడ్ సైన్స్&న్యూట్రీషన్), BTech/BE, BSc అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. Sr. ప్రాజెక్ట్ అసోసియేట్‌కు గరిష్ఠ వయసు 40 ఏళ్లు కాగా.. మిగతా పోస్టులకు 35ఏళ్లు. సైట్: www.iict.res.in

Similar News

News February 23, 2026

ఇండియా ఫైనల్ మ్యాచ్‌కు జగన్‌కి టికెట్ కొంటా: లోకేశ్ సెటైర్

image

AP: T20 WCలో ఇండియా ఫైనల్‌కి వెళ్తుందని, ఆ మ్యాచ్‌కి తనతోపాటు పులివెందుల MLA జగన్‌కు టికెట్ కొంటానని మంత్రి లోకేశ్ సెటైర్ వేశారు. IND-PAK మ్యాచ్‌కు <<19184657>>తాను వెళ్లడం<<>>పై YCP విమర్శలకు అసెంబ్లీ ఆవరణలో కౌంటరిచ్చారు. తనకు దేశభక్తి ఉందని, మనవాళ్లు ఎక్కడ మ్యాచ్ ఆడినా వెళ్తానని అన్నారు. హెరిటేజ్ ప్రారంభించినప్పటి నుంచి ప్రభుత్వ నిధులు రూపాయి కూడా ఆ సంస్థకు మళ్లించలేదని స్పష్టంచేశారు.

News February 23, 2026

116 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>SBI <<>>116 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్(AVP, డిప్యూటీ మేనేజర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి మార్చి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BSc/BE/BTech, BCA/MCA, M.Tech, MSc, CA, ICAI అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in/

News February 23, 2026

ఆయన వల్లే మళ్లీ నాలో మార్పు: సమంత

image

డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో తన వివాహ బంధం గురించి హీరోయిన్ సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘గతంలో నేను విడిపోయినప్పుడు ఇంకొకరిపై ఆధారపడటం సాధ్యమవుతుందని అనుకోలేదు. అదృష్టవశాత్తూ ప్రేమ, స్నేహాన్ని అంగీకరించేంత బలహీనంగా మారిపోయా. నేనున్న రిలేషన్‌షిప్ వల్ల బెటర్‌గా మారిపోయా. రాజ్ నిడిమోరు వల్లే ఇది సాధ్యమైంది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్‌లో రాజ్, సమంత ఒక్కటయ్యారు.