News February 19, 2026

ఉమ్మడి NZB జిల్లాలో చికెన్ ధర ఎలా ఉందంటే?

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ మొదలవ్వడంతో కొనుగోళ్లు ఎక్కువయ్యాయి. కేజీలలో లైవ్ కోడి రూ.150 కాగా విత్ స్కిన్ రూ.200, స్కిన్ లెస్ రూ.220, బోన్ లెస్ రూ.240, చికెన్ లివర్ రూ. 170. మటన్ కేజీ రూ.700 నుంచి 900 వరకు అమ్మకాలు కొనసాగుతున్నాయి. మాంసం ప్రియులు ఇటు చికెన్‌తో పాటు అటు మటన్ కొనుగోలు చేస్తున్నారు.

Similar News

News March 7, 2026

MDK: నొప్పి తట్టుకోలేక ఆత్మహత్య

image

మెదక్ జిల్లా తూప్రాన్‌కి చెందిన తాపీ మేస్త్రి తిమ్మాపురం సత్యనారాయణ (55) అనారోగ్యం కారణంగా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. గతంలో ఆయనకు బైపాస్ సర్జరీ జరిగ్గా, ఇటీవల పక్షవాతం (పెరాలసిస్) బారిన పడ్డారు. శారీరక ఇబ్బందులతో నొప్పి తట్టుకోలేక శనివారం ఇంట్లో ఉరివేసుకున్నట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 7, 2026

టీమ్ ఇండియాపైనే ఒత్తిడి: షోయబ్ అక్తర్

image

T20 WC ఫైనల్‌లో టీమ్ ఇండియాపైనే ఒత్తిడి ఉందని పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ చెప్పారు. ‘అహ్మదాబాద్‌లో 175-200 స్కోరు నమోదు కావచ్చు. ఒకవేళ న్యూజిలాండ్ 225-250 కొడితే భారత్‌పై ప్రెజర్ పడుతుంది. ఎందుకంటే 150 కోట్ల మంది చూస్తుంటారు. పైగా ఇదే గ్రౌండ్‌లో 2023 ODI WC ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓడింది’ అని అన్నారు. IND టైటిల్ ఫేవరేట్ అని, అయితే NZ గెలవడం కూడా క్రికెట్‌కు మంచిదని అభిప్రాయపడ్డారు.

News March 7, 2026

మానుకోటలో రాజకీయ వేడి!

image

తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 153కి పెరుగుతాయన్న ప్రచారంతో మహబూబాబాద్ జిల్లా రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో రెండు నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో ఉండగా, మరో ఆరు మండలాలు పక్క నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నాయి. పునర్విభజన జరిగితే కొత్తగా ఏ నియోజకవర్గం ఏర్పడుతుందనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇది జరిగితే జిల్లాలో బీసీ, గిరిజన సామాజికవర్గాల ప్రాబల్యం పెరిగే అవకాశం ఉంది.