News February 19, 2026

రాష్ట్ర పండుగగా రాజాం పైడితల్లి అమ్మవారి జాతర

image

AP: విజయనగరం(D) రాజాంలోని శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. ఉత్సవాలకు రూ.50లక్షల నిధుల మంజూరుకు ఆదేశాలిచ్చింది. తదుపరి చర్యలు తీసుకోవాలని దేవదాయశాఖ కమిషనర్‌ను ఆదేశించింది. పైడితల్లి ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు. అమ్మవారి ఉత్సవాలు 1758 నుంచి ఏటా నిరాటంకంగా కొనసాగుతున్నాయి.

Similar News

News April 16, 2026

భార్యాభర్తల బంధం.. 5-5-5 రూల్‌తో పదిలం!

image

భార్యాభర్తలు గొడవలను దురుసుగా కాకుండా 5-5-5 రూల్‌తో పరిష్కరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఐదు నిమిషాలు భార్య మాట్లాడితే ఆ తర్వాత ఐదు నిమిషాలు భర్త మాట్లాడాలి.. మిగతా 5 నిమిషాలు పరిష్కారానికి కేటాయించాలనేది ఈ కాన్సెప్ట్. మొదటి పది నిమిషాల్లో ఒకరి మాటలను మరొకరు శ్రద్ధగా వినాలి. మధ్యలో కలగజేసుకోకూడదు. దీంతో పాటు రోజూ అభినందించుకోవడం, సాయపడటం వంటివి చేస్తే అనురాగం పెరిగి బంధం బలంగా ఉంటుంది.

News April 16, 2026

HMTలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కాంట్రాక్ట్ పద్ధతిలో 2 డిప్యూటీ ఇంజినీర్, 2 ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి HMT దరఖాస్తులను కోరుతోంది. మెకానికల్‌/ప్రొడక్షన్‌‌‌లో 60% మార్కులతో ఇంజినీరింగ్‌ పూర్తిచేసి రెండేళ్ల ఉద్యోగ అనుభవం ఉన్నవారు అప్లై చేయొచ్చు. జీతం నెలకు రూ.16,400-రూ. 40,500. వయసు 30 ఏళ్లు దాటకూడదు. ఇంటర్వ్యూ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌‌‌‌లో అప్లై చేయడానికి APR-26 చివరి తేదీ. పూర్తి వివరాలకు www.hmtindia.com చూడండి.

News April 16, 2026

రోడ్డు ప్రమాద బాధితులను కాపాడేవారికి రూ.25వేలు: మంత్రి

image

AP: రోడ్డు ప్రమాదాల్లో మొదటి గంటలోపు క్షతగాత్రులకు ‘PM రాహత్’ కింద ₹1.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘వీరి వైద్యం ఖర్చు ఇంకా ఎక్కువైనా మిగతా మొత్తాన్ని NTR వైద్యసేవ కింద అందిస్తాం. రోడ్డు ప్రమాదాల బాధితులను ఆసుపత్రిలో చేర్పించే వారికిచ్చే ప్రోత్సాహకాన్ని ₹5వేల నుంచి 25వేలకు పెంచారు’ అని తెలిపారు. వీరికి పోలీసుల వైపు నుంచి సమస్య లేకుండా చూస్తామని చెప్పారు.